ఆ వైసీపీ ఎమ్మెల్యే కోర్టు పక్షిగా మారారా?

జగన్ ప్రభుత్వం టీడీపీ నేతలపై కక్ష సాధిస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తమపై తప్పుడు కేసులు పెట్టించి అరెస్టులు చేయిస్తున్నారన్నది టీడీపీ ఆరోపణ. ఇందుకు అనుకూలంగా వ్యవహరించేందుకు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్‌కు ఓ పావుగా ఉపయోగపడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే ఆర్కే కు కోర్టుల్లో పిటిషన్ లు వేయడం ఒక అలవాటుగా మారిందని మాజీ ఎమ్మెల్యే తెనాలి sravan KUMAR' target='_blank' title='శ్రవణ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">శ్రవణ్ కుమార్ ఆరోపించారు.

ఎమ్మెల్యే ఆర్కే కోర్టు పక్షిగా మారారని.. ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా చిత్రీకరించే అలవాటు ఎమ్మెల్యే ఆర్కే కు ఉందని మాజీ ఎమ్మెల్యే తెనాలి sravan KUMAR' target='_blank' title='శ్రవణ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">శ్రవణ్ కుమార్ ఆరోపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడ్డంకులు సృష్టించి ఇప్పుడు మళ్లీ దానిపైనే కేసు వేయడం విడ్డురమని.. రాంకీ గ్రూప్ లో వందల కోట్లు దొరికితే ఆర్కే ఎందుకు మాట్లాడలేదని మాజీ ఎమ్మెల్యే తెనాలి sravan KUMAR' target='_blank' title='శ్రవణ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">శ్రవణ్ కుమార్ ప్రశ్నిస్తున్నారు. కోర్టు ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు అని చెప్తే...ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు అంశాన్ని తెరపైకి తెచ్చారంటున్న మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్.. నారాయణ సంస్థలు నాశనం చేయాలి అని కుట్ర కోణం ఉందన్నారు.

ఫోన్ ట్యాపింగ్ చేయడం నేరం అని మంత్రి పెద్దిరెడ్డికి తెలియదా అంటూ ప్రశ్నించారు. నారాయణ ఫోన్ ను ట్యాప్ చేయించామని వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రికార్డెడ్‌గా ఒప్పుకున్నారని ఇతర టీడీపీ నేతలు కూడా గుర్తు చేస్తున్నారు. నారాయణ ఫోన్ ట్యాప్ చేశామని మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రికార్డెడ్ గా చెప్పటం తనకు షాక్ కు గురి చేసిందని ఇప్పటికే నారా లోకేశ్ ఆరోపించిన సంగతి తెలిసిందే.

టీడీపీ నేతలపై కక్ష సాధించేందుకు చట్టాలు, రాజ్యాంగాన్ని సైతం వైసీపీ విస్మరిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎవరి ఫోన్‌నైనా ట్యాప్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఇష్టానుసారంగా తుంగలో తొక్కేందుకు ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చే ఫాసిస్టు రాష్ట్రంగా ఏపీ మారిందంటున్నారు. విపక్షాలపై అసత్య ఆరోపణలు  చేస్తూ సొంత అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ ప్రయత్నించడం సిగ్గుచేటు అని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: