బండి సంజయ్‌ యాత్రతో కేసీఆర్‌ గుండెల్లో గుబులు?

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర టీఆర్‌ఎస్‌ అధినాయకత్వంలో వణుకు పుట్టిస్తోందా.. బండి సంజయ్ పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి తెరాసకు భయం పట్టుకుందా.. అంటే అవునంటున్నారు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ. అందుకే మహబూబ్ నగర్ కు కేటీఆర్ వెళ్లి అనేక శంకుస్థాపనలు చేశారని.. నారాయణ పేట సభలో కేటీఆర్ భాజపా నాయకులను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని రాణి రుద్రమ అన్నారు.

టీఆర్ఎస్ దక్షిణ తెలంగాణను తెరాస ఎడారి చేసిందని.. ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు కేఆర్ఎంబీలో 34 శాతం వాటాకే ఎట్లా సంతకాలు పెట్టారని   బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ ప్రశ్నించారు. కృష్ణా పరివాహక ప్రాంత రైతులను కేసీఆర్ మోసం చేసుకుంటూ.. రాయలసీమను రతనాల సీమ చేస్తానంటున్న కేసీఆర్.. ఎనిమిదేళ్లలో మన వాటా దక్కించుకునేందుకు ఒక్క ప్రాజెక్టు అయిన కట్టారా అని  బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ ప్రశ్నించారు.

గట్టు రిజర్వాయర్ ను శంకుస్థాపనకే పరిమితం చేశారని.. ఆర్డీఎస్ నుంచి ఆంధ్ర నీళ్లు తరలించుకుపోతూనే ఉందని..  బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ విమర్శించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్లోరోసిస్ తో అల్లాడిపోతుంటే.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. ఉదయ సముద్రం ప్రాజెక్టు ఒక ఇంచైన కదిలిందా అన్న విషయాన్ని కేటీఆర్ చెప్పాలని  బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ నిలదీశారు. జాతీయ పార్టీని ప్రశ్నించే అర్హత తెరాసకు లేదని.. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు పెట్టిందా అని  బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ ప్రశ్నించారు.

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు కోసం పది వేల కోట్లు తెచ్చి ఏమీ చేశారో చెప్పాలన్న  బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ.. నీళ్లు, నిధులు, నియామకాలు, పాలమూరు అభివృద్ధిపై చర్చకు తెరాస సిద్ధమా అని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: