జ‌గ‌న్ కేబినెట్లో ఆ మంత్రి గారికి సెకండ్ ఛాన్స్... ?

VUYYURU SUBHASH
ఇప్పుడు జగన్ క్యాబినెట్‌లో ఎవరు కొనసాగుతారనే అంశం బాగా ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే..జగన్ ఎలాగో మంత్రివర్గంలో మార్పులు చేయడానికి సిద్ధమయ్యారు..అయితే అందరినీ సైడ్ చేసి కొత్తవారిని తీసుకుంటారా? అనేది మొదట నుంచి వస్తున్న చర్చ..కానీ ఇటీవల జగన్ చెప్పిన మాటలు బట్టి చూస్తే నలుగురైదుగురు మాత్రం క్యాబినెట్‌లో కొనసాగుతారని అర్ధమవుతుంది. ఇక ఇందులో పూర్తి నిజమెంత ఉందో..క్యాబినెట్‌లో మార్పులు జరిగే వరకు తెలియదు.

సరే ముఖ్యమైన వారిని మాత్రం కొనసాగించే అవకాశాలు ఉన్నాయని మాత్రం తెలుస్తోంది..జగన్ ఖచ్చితంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఐదేళ్ల పాటు కొనసాగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే ఆర్ధిక మంత్రి పదవి మరొకరు నడపటం చాలా కష్టం...ఒకవేళ ఆయన్ని పక్కన పెడితే  ఆనం రామ్ నారాయణ రెడ్డి లాంటి సీనియర్లని క్యాబినెట్‌లోకి తీసుకుని ఆర్ధిక మంత్రి పదవి ఇవ్వాలి...కానీ ఆ ఛాన్స్ ఎక్కువ కనిపించడం లేదు.

కాబట్టి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఖచ్చితంగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది..ఇక సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణని కూడా ఐదేళ్ల పాటు కొనసాగిస్తారని తెలుస్తోంది. అలాగే బాలినేని శ్రీనివాస్ రెడ్డిని సైతం కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది..ఇక చంద్రబాబుని చెడామడా తిట్టే కొడాలి నానిని సైతం కంటిన్యూ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక వీరిని పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా మరో మంత్రిని కంటిన్యూ చేస్తారని ప్రచారం జరుగుతుంది.

ప్రత్యర్ధులపై వెటకారపు పంచులు వేసే పేర్ని నానిని సైతం మంత్రివర్గంలో కొనసాగిస్తారని తెలుస్తోంది. పేర్ని లాంటి వారు క్యాబినెట్‌లో ఉంటే ప్రత్యర్ధులకు చెక్ పెట్టొచ్చని జగన్ భావిస్తున్నారట. ముఖ్యంగా టీడీపీ-జనసేన పొత్తు సెట్ అవుతున్న నేపథ్యంలో పవన్ లాంటి వారికి కౌంటర్లు ఇవ్వాలంటే పేర్ని బెటర్ అంటున్నారు. కాబట్టి పేర్నిని ఐదేళ్ల పాటు కంటిన్యూ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. కాకపోతే ఒకే జిల్లాకు చెందిన కొడాలి, పేర్నిలని కంటిన్యూ చేస్తారనేది డౌటే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: