టార్గెట్ కొడాలి.... కృష్ణా టీడీపీ క‌మ్మ నేత‌లు సైలెన్స్ వెన‌క మ‌త‌ల‌బు ఏంటో ?

VUYYURU SUBHASH
మొత్తానికి కొడాలి నానిని తమ్ముళ్ళు వదలడం లేదు. చంద్రబాబుని ఇష్టమొచ్చినట్లు తిడుతున్నా కొడాలికి ఎలాగైనా చెక్ పెట్టాలని టార్గెట్ పెట్టుకుని మరీ తమ్ముళ్ళు రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. అసలు వైసీపీ అధికారంలోకి వచ్చి, కొడాలి మంత్రి అయిన దగ్గర నుంచి, ఆయన పని ఒక్కటే, చంద్రబాబుని తిట్టడమే. మంత్రిగా తన శాఖకు సంబంధించి ఎలాంటి పనులు చేస్తున్నారో జనాలకు కూడా సరిగ్గా తెలియదు. ఈయన కేవలం చంద్రబాబుని తిట్టే మంత్రిగా బాధ్యతలు చేస్తున్నారని అనుకుంటున్నారు.

అవును వాస్తవానికి చూస్తే...కొడాలి నాని ఏ శాఖ బాధ్యతలు చూసుకుంటున్నారో ఎవరికి సరిగ్గా తెలియదనే చెప్పొచ్చు. కేవలం నాని ఉన్నది బాబుని తిట్టడానికే అనేది మాత్రం తెలుస్తుంది. ఇలా చంద్రబాబుని ఎడాపెడా తిడుతున్న నానిపై తమ్ముళ్ళు మొదట నుంచి గుర్రుగానే ఉంటున్నారు. అందుకే కొడాలికి చెక్ పెట్టాలని చెప్పి తమ్ముళ్ళు గట్టిగా ట్రై చేస్తున్నారు. అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇక తాజాగా గుడివాడలో గోవా తరహాలో క్యాసినో నడిపారని కథనాలు వచ్చాయి. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా వచ్చాయి. అయితే పండుగ మూడు రోజులు ఈ వ్యవహారం జరిగిందని అందరికీ తెలుసు.

కాకపోతే కొడాలి ఆరోగ్యం బాగోక హైదరాబాద్‌లో ఉన్నారు. దీంతో క్యాసినోతో తనకేమి సంబంధం లేదని నాని అంటున్నారు...అలాగే తనపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలని దారుణంగా తిట్టారు. ఎప్పటిలాగానే చంద్రబాబుని తిట్టారు..ఇక చంద్రబాబు ఇంట్లో వ్యభిచారం నడుపుతున్నారంటూ మాట్లాడారు. ఇలా బూతులు హద్దులు దాటేశాయి. దీనికి టీడీపీ నుంచి కూడా గట్టిగానే కౌంటర్లు వచ్చాయి. దమ్ముంటే కొడాలి..చంద్రబాబు ఇంటి గేటు తాకాలని, తాకితే శవమై పోతారని బుద్దా వెంకన్న నోరు జారారు. ఆ వెంటనే బుద్దాని పోలీసులు అరెస్ట్ చేశారు.

బుద్ధా అరెస్టుతో పెద్ద ఎత్తున హైడ్రామా న‌డిచింది. అయితే ఇక్కడ బుద్దా వెంకన్న, బోండా ఉమా లాంటి వారు కొడాలిని టార్గెట్ చేశారు గాని, కృష్ణా జిల్లా కమ్మ నేతలైన కేశినేని నాని, గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్ లాంటి వారు మాత్రం...కొడాలిపై ఒక్క విమర్శ చేయలేదు. మరి ఇందులో ఏం మతలబు ఉందో బాబుకే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: