ఎడిటోరియల్ : అందరి నిందలూ బాబు మీదే ? 'కమ్మ 'టి దెబ్బ ?

రాజకీయాలు అంటేనే కులం మతం డబ్బు అధికారం వీటి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఈ లెక్కలు లేకుండా రాజకీయం నడవడం అసాధ్యం. ప్రస్తుత టిడిపి కానీ అధికార పార్టీ వైసిపి కి ప్రజా బలం ఎంత ఉన్నది అన్నది పక్కన పెడితే , కుల లెక్కల్లో సక్సెస్ అయిన దాన్నిబట్టే అధికారంలోనూ, ప్రతిపక్షంలోనూ కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. అన్ని రాజకీయ పార్టీలు కులాల మద్దతు కోసం ప్రయత్నిస్తూ, ఆ లెక్కల్లో సక్సెస్ కావడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే మొదటి నుంచి ఆ పార్టీకి అండదండగా ఉంటూ,  అధికారంలోకి వచ్చేందుకు సహకరించడం, మూడుసార్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ప్రధాన కారణంగా నిలిచింది. 




మొదటి నుంచి బీసీల పార్టీగా తెలుగుదేశం పార్టీ ముద్ర వేయించుకుంది. అలాగే కమ్మ సామాజిక వర్గం పూర్తి మద్దతు ఆ పార్టీకి ఉంటూ వచ్చింది. అదే విధంగా తెలుగుదేశం పార్టీ సైతం కమ్మ సామాజిక వర్గం కు ప్రయోజనాలు కల్పించే విషయంలో ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వచ్చేది. అయితే గత టీడీపీ ప్రభుత్వం కాపులను దగ్గర చేసుకునేందుకు ఆ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం,  ప్రభుత్వ, పార్టీ పదవుల్లోనూ ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం, అలాగే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి భారీగా ఆ సామాజికవర్గం నేతలకు నిధులు కేటాయింపు చేయడం ఎలా ఎన్నో అంశాలతో మిగతా సామాజిక వర్గాలను పెద్దగా పట్టించుకోనట్టు గా వ్యవహరించింది. దీని కారణంగా కాపులను వ్యతిరేకించే బీసీ సామాజిక వర్గంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది.





 దాని ఫలితంగానే 2019 ఎన్నికలలో టిడిపి ఎప్పుడు చవిచూడని అంతటి ఓటమిని చూడాల్సి వచ్చింది. ఇక ప్రస్తుతం టిడిపి ప్రతిపక్షంలో ఉంది.అధికార పార్టీలో ఉన్న వైసిపి ని టిడిపి దెబ్బకొట్టేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే ఆ సామాజిక వర్గాన్ని ఎక్కువగా టార్గెట్ చేసుకున్నట్లుగా వ్యవహరిస్తూ వస్తుండడంతో, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఇప్పుడు డైలమాలో పడ్డారు. ప్రస్తుతం చంద్రబాబు వయసు రీత్యా చూసుకున్నా, ఆయన వల్ల ముందు ముందు తమకు కలిసి వచ్చేది లేదని, అలాగే బాబుకు జై కొట్టడం ద్వారా వైసీపీ ప్రభుత్వంతో అనవసర చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయంతో ఉంది. అందుకే బాబు కు ప్రత్యామ్నాయం గా కమ్మ సామాజిక వర్గం నుంచి ఎవరిని హైలెట్ చేయాలనే విషయం పైన దృష్టి సారించిందట. 




ఇక వైసీపీ ప్రభుత్వం సైతం బీసీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ,  అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ, ఆ సామాజిక వర్గానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుండటంతో అటు బీసీలు, ఇటు కమ్మలు టిడిపికి దూరం అవుతున్నట్లుగా వ్యవహారం కనిపిస్తోంది. ఈ రకమైన పరిస్థితులు టిడిపికి మరిన్ని కష్టాలు తీసుకు వస్తాయి అనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: