ప్రపంచంలోనే ప్రబలశక్తిగా ఇండియా.. మోడీ ప్లాన్‌ సక్సస్‌?

frame ప్రపంచంలోనే ప్రబలశక్తిగా ఇండియా.. మోడీ ప్లాన్‌ సక్సస్‌?

Chakravarthi Kalyan
ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా నినాదం.. దేశంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టింది. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో అనేక రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా భారత దేశంలో తయారీ రంగంలో శక్తిమంతంగా మార్చేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు విశేషంగా కృషి చేస్తోంది.

దీనికి తగినట్టుగా ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ నినాదాన్ని తీసుకువచ్చి.. దాని కోసం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తోంది. ఈ చొరవకు తగినట్లుగా ఎలక్ర్టానిక్ స్వదేశీ ఉత్పత్తులు కూడా పెరిగాయి. ఇంకా ఎగుమతి చేయడమే కాదు.. ప్రపంచంలో ఎలక్ర్టానిక్ వస్తువుల ఎగుమతి చేసే దేశంలో భారత్ అగ్రస్థానంలో ఉండటం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉండగా మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అయిదో అతి పెద్దదిగా నిలిచింది. ఇక టాప్-3 లో నిలవడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోంది. ఇదిలా ఉండగా.. తయారీ రంగంపై మోదీ సర్కారు చూపిన శ్రద్ధ  వర్కౌట్ అయిందనే చెప్పొచ్చు. మ్యాను ఫ్యాక్చర్  రంగంలో సైత్ కొరియారు దాటి ఐదో స్థానానికి భారత్ చేరింది. ఇది ఓ రకంగా చెప్పాలంటే భారత్ సాధించిన అద్భుత వృద్ధి. దీనికి మోదీ సర్కారు అందించిన ప్రోత్సాహం వెలకట్టలేనిది. మొత్తంగా చూసుకుంటే రూ.46,58,781 కోట్లతో  చైనా మ్యాను ఫ్యాక్చర్ రంగంలో తొలిస్థానంలో నిలిచింది. ఆ తర్వాత రూ.24,97,131 కోట్లతో అమెరికా ద్వితీయ స్థానంలో నిలిచింది.

జర్మనీ రూ.8,44,921 కోట్లతో మూడో స్థానాన్ని ఆక్రమించగా.. జపాన్ రూ.8,18,397 కోట్లతో నాలుగు స్థానంలో ఉంది. మన దేశ విషయానికి వచ్చే సరికి.. రూ.4,55,766 కోట్లతో అయిదో స్థానానికి ఎగబాకింది. ఇంతకు ముందు ఐదో ప్లేస్ లో ఉన్న దక్షిణ కొరియా రూ.4,16,389  కోట్లతో ఆరు స్థానానికి పడిపోయింది. ఈ తర్వాత మెక్సికో, ఇటలీ, ఫ్రాన్స్, బ్రెజిల్, యూకే, ఇండోనేషియా, రష్యా, టర్కీ, ఐర్లాండ్ లు ఉన్నాయి. భారత్ తదుపరి లక్ష్యం ఇక టాప్ -3 చేరడమే. మొత్తానికి అటు ఆర్థిక వ్యవస్థలో.. ఇటు తయారీ రంగంలో భారత్ అద్భుతంగా రాణిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: