పాపం.. ప్రపంచవ్యాప్తంగా నవ్వులపాలవుతున్న పాకిస్తాన్‌?

Chakravarthi Kalyan
పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి, ఇతర వ్యవహారాలు ఏమంత బాగా లేకపోయినా సంచలన నిర్ణయాలు వెల్లడించడంలో ఏమాత్రం వెనకడుగు వేయదు. అసలు అక్కడ ప్రజాస్వామ్యం ఉందా అనే తరహాలో పాక్ ప్రభుత్వ వ్యవహారశైలి ఉంటుంది. పైగా వారు మనకి నీతులు చెబుతూ తమ వక్రబుద్ధిని బయట పెడుతూ ఉంటారు.

ఇంతకీ విషయం ఏంటంటే…అక్కడ ఎవరు పాలించాలి. ఎవరు అధికారంలో ఉండాలి వంటి విషయాలను సైన్యమే నిర్ణయిస్తుంది.  పాక్ లో పేరుకే ప్రజాస్వామ్యం ఉంటుంది. అక్కడ ఎన్నికల సమయంలో రిగ్గింగ్ ఏ విధంగా జరిగిందో వీడియోలు బయటకు వచ్చాయి. నేరుగా పోలింగ్ రూమ్ ల్లోకి వెళ్లి ఇష్టం వచ్చినట్లు ఓట్లు వేసుకున్నారు. అక్కడ సైన్యం మద్దతు ఉంటే చాలు. ప్రజామోదం లేకపోయినా అధికారం చేపట్టవచ్చు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల జరిగిన ఎన్నికలు.

ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో అతనిపై లేనిపోని కేసులు పెట్టి జైలు పాలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా అతని పార్టీ పీటీఐ ని నిషేదించారు. అయినా అతని పార్టీ అభ్యర్థులు ఇండిపెండెంట్ గా ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజలు ఆదరించారు. కానీ వరసు కేసులు పెట్టి ఉక్కిరిబిక్కిరి అవుతూ జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ కు అనుకూలంగా అక్కడి కోర్టులు తీర్పులు ఇస్తున్నాయి. దీంతో అతనిపై రోజుకో కొత్త కేసు నమోదు అవుతూ జైలు నుంచి బయటకు రాకుండా చేసేందుకు ప్రయత్నాలు  జరుగుతున్నాయి.

ఇక ఇప్పుడు ఏకంగా ఆయన పార్టీ పాకిస్థాన్ తెహ్రీకి ఇన్సఫ్ పై నిషేధానికి ప్రభుత్వం సిద్ధమైంది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ 1996లో పీటీఐని స్థాపించి 2018లో తొలిసారి అధికారం చేపట్టారు. అవిశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో 2022లో ప్రభుత్వం కూలిపోయింది. అప్పటి నుంచి వివిధ కేసుల్లో ఆయన రావల్పిండిలోని ఆడియాలా జైలులో ఉన్నారు. ఎప్పుడు అయితే సైన్యం, ఉగ్రవాదుల చేతిలో నుంచి పాక్ ప్రభుత్వం బయటకు వస్తుందో అప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: