ఆంధ్రాకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మోదీ?

Chakravarthi Kalyan
లక్షల ఏళ్ల క్రితం సహజ సిద్ధంగా ఏర్పడిన రెండు శతాబ్దాలుగా పర్యాటకాదరణ పొందుతున్న బొర్రా గుహలకు మహర్దశ పట్టనుంది. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన స్వదేశీ దర్శన్ కార్యక్రమంలో భాగంగా బొర్రా గుహలకు చోటు దక్కింది. రూ.29.88 కోట్లతో వీటిని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది.

ప్రధాని మోదీ స్వేదేశీ దర్శన్ కింద దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో బొర్రా గుహలు ఒకటి కావడం విశేషం. 1807లో విలియం కింగ్ గుర్తించిన ఈ గుహల్లో సున్నపురాయి ఖనిజంతో ఏర్పాటయిన మానవమెదడు, శివలింగం, డైనోసార్, మొసలి, శివపార్వతి, తల్లీబిడ్డ, రుషి, సాయిబాబా, తేనెపట్టులాంటి వివిధ ఆకృతులు చూపరులను కనువిందు చేస్తున్నాయి. 1995 ముందు వరకు స్థానిక గిరిజనులు కాగడాలతో బొర్రా గుహలును నిర్వహించారు. తర్వాత పర్యాటక శాఖ, విద్యుత్తు సౌకర్యం కల్పించి లైట్లను ఏర్పాటు చేసింది.

స్థానిక గిరిజనలకు టికెట్ పై కమీషన్ ఇచ్చి నడిపేవారు. 2000 నుంచి పర్యాటక శాఖ నిర్వహిస్తోంది. వచ్చే ఆదాయంలో కొంత మేర గుహల అభివృద్ధికి కేటాయించారు. కేంద్రం స్వేదశీ సందర్శన్ పథకంలో భాగంగా మంజూరు చేసిన రూ.29.88 కోట్లతో మూడు విభాగాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. మొదటి విభాగంలో రైల్వే స్టేషన్ నుంచి కొండ ప్రాంతంలోని పార్కింగ్ ప్రదేశం వరకు  రోడ్డు మార్గంలోని దారి పొడవునా వీధి లైట్లు ఏర్పాటు చేస్తారు.

పార్కింగ్ ప్రదేశాన్ని సుందరంగా అభివృద్ధి చేయడంతో పాటు పచ్చదనంతో ఆకర్షణీయంగా తీర్చి దిద్దుతారు. రెండో విభాగంలో బొర్రా గుహలు ముఖ ద్వారం వద్ద తాత్కాలికంగా షాపింగ్ స్ర్టీట్ ఏర్పాటు చేస్తారు. మూడో విభాగంలో బొర్రా ముఖద్వారం వద్ద పర్యాటకుల సౌకర్యార్థం క్యాష్ లెస్ టికెట్ విధానంలో అమలు చేస్తారు. సందర్శన టికెట్లు ఆన్ లైన్, పేటీఎం ద్వారా బుక్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఇప్పటి వరకు బొర్రా గుహల్లో 40 వరకు బెల్జియం లైట్లు ఉండగా.. మరో 60 అదనంగా ఏర్పాటు  చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: