మోదీ నుంచి బాబుకు కావాల్సింది అదొక్కటే?

Chakravarthi Kalyan
ఏపీలో బీజేపీ క్షేత్రస్థాయిలో బలంగా లేకపోయినా చంద్రబాబు ఆ పార్టీతో పొత్తుకోసం వెంపర్లాడుతున్నారు. ఎందుకంటే కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి అండదండలు ఉంటాయనే ఉద్దేశంతో.. రాష్ట్రంలో జగన్ తన అధికారాలను అడ్గు పెట్టుకొని పోల్ మేనేజ్ మెంట్ చేస్తే తాను వెనుకపడతాను అని చంద్రబాబు భావిస్తున్నారు. ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే పోల్ మేనేజ్ మెంట్ సమయంలో పైచేయి సాధించవచ్చు అనేది ఆయన వ్యూహం.

దీంతో పాటు వైసీపీ నాయకులు చేసే అవినీతిపై కూడా విచారణ జరిపి జగన్ ను ఇరకాటంలో పడేయొచ్చు. వాస్తవానికి చంద్రబాబు మోదీ దగ్గర నుంచి కోరుకునేది అదే.  టీడీపీ నాయకులు కేంద్రం చంద్రబాబుపై కుట్రలు పన్నిందని ఆరోపిస్తుంటారు. వాస్తవాలు గమనిస్తే.. 2018లో ఎన్డీయే పై తీవ్ర విమర్శలు చేసి చంద్రబాబు బయటకు వచ్చారు. కానీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో గత ప్రభుత్వం చేసిన ప్రాజెక్టులపై.. ఇతర అభివృద్ధి పనులపై కేంద్ర సంస్థలతో దర్యాప్తునకు ఆదేశించలేదు.

కానీ టీడీపీ నేతలు చంద్రబాబుపై మోదీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తుంటారు. బీజేపీతో టీడీపీ పొత్తు ఓకే అయితే.. జగన్ డబ్బులను నియోజవకర్గాలకు అందకుండా చేయవచ్చు. తద్వారా డబ్బులు పంపిణీ చేయకుండా ఆపవచ్చు. మరోవైపు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులను ఆపితే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పడుతుంది. తద్వారా సంక్షేమ పథకాలను ఆపించగలిగితే అది జగన్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది.

దీంతో పాటు జగన్ ఆర్థిక మూలాలను దెబ్బకొడితే అసెంబ్లీ ఎన్నికల్లో పైచేయి సాధించవచ్చు. ఇప్పటికే మధ్య తరగతి ప్రజల్లో ప్రభుత్వంపై కొంతమేర వ్యతిరేకత తీసుకురాగలిగారు. పేదల విషయానికొస్తే ఎన్ని సంక్షేమ పథకాలు అందించినా.. ఎన్నికల సమయంలో ఓటుకు నోటు ఇస్తేనే ఆ పార్టీని ఆదరిస్తారు. ఈ లెక్కలన్నీ చంద్రబాబుకి తెలుసు కాబట్టే మోదీని దగ్గరకు తీస్తున్నారు. బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: