జగన్.. ఆర్థిక వేట.. మామూలుగా లేదుగా?

Chakravarthi Kalyan
చంద్రబాబు పై జగన్ కి ఎందుకంత కోపం అంటే తనను జైలులో ఉంచేందుకు ఆయన తెర వెనుక నుంచి ప్రయత్నాలు చేశారు. దీంతో పాటు తన ఆర్థిక మూలాలను దెబ్బతీశారు.  అయినా మొండిగా ఎన్నికల్లో పోటీ చేస్తే వైసీపీలో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకొని.. జగన్ ని రాజకీయంగా దెబ్బతీసేందుకు యత్నించారు.  కానీ జగన్ ధైర్యంగా వాటిని ఎదుర్కొని అఖండ మెజార్టీతో విజయం సాధించి టీడీపీని అదే 23 స్థానాలకు పరిమితం చేశారు.

ఇప్పుడు జగన్ చంద్రబాబు ఆర్థిక మూలాలను వెంటాడుతున్నారు. అమరావతి ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర లేపి జేబులు నింపుకుందామని భావించిన వారి ఆశలపై నీళ్లు చల్లారు. దీంతో పాటు టీడీపీకి ఫండింగ్ ఇచ్చే నేతలను దెబ్డతీశారు. వాటి నుంచి ఇప్పుడిప్పుడే బయట పడి వేమిరెడ్డి, లావు శ్రీ కృష్ణదేవరాయలు వంటి నేతలను తెచ్చుకని ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారు.

కానీ.. టీడీపీకి నిధులు సమకూర్చి పార్టీకి ఆర్థికంగా అండగా ఉన్న ఇద్దరి నేతలను జగన్ వెంటాడుతున్నారు. అందులో ఒకరు  పత్తిపాటి శరత్ ని తాజాగా అరెస్టు చేశారు. ఈయనతో పాటు మాజీ మంత్రి నారాయణ. జీఎస్టీ ఎగవేత పేరుతో అధికారులు దాడులు చేయగా.. రూ.కోటిన్నర నగదు దొరికింది. దీంతో పాటు భూ రిజిస్ర్టేషన్ లు అవకతవకలు జరిగాయి అని గుర్తించారు.  వ్యాపారం చేసే వారి దగ్గర లొసుగులు కామన్ గా ఉంటాయి. కానీ సమయానుగుణంగా చర్యలు తీసుకోవడం వెనుక జగన్ వ్యూహం కనిపిస్తోంది.

దీంతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన కీలక నేతలు వేం రెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వారు టీడీపీలో చేరారు. తాజా పరిణామాల నేపథ్యంలో విపక్ష టీడీపీ నేతల ఇళ్లను లక్ష్యంగా చేసుకొని పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 15 చోట్ల పోలీసులు ఏక కాలంలో తనిఖీలు చేశారు. ఎన్నికల కోసం భారీ ఎత్తున డబ్బు నిల్వ చేశారన్న ఆరోపణలతో ఈ డాడులు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: