బుల్లెట్లు లేని తుపాకీలతో బ్రిటన్ సైన్యం యుద్ధం?

Chakravarthi Kalyan
పాలస్తీనా పై ఇజ్రాయెల్ దాడిని నిరసిస్తూ హౌతీలు కొంతకాలంగా దాడులుకు పాల్పడుతున్నారు. ఇజ్రాయెల్ దేశానికి అనుకూలంగా ఉన్న అమెరికా పై నిప్పులు కక్కుతున్నారు. ఇజ్రాయెల్ వెంటటే దాడులను మానుకోవాలని ఎర్ర సముద్రంలో పాగా వేశారు. ముఖ్యంగా యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇంగ్లాండ్ లోని కొన్ని ప్రాంతాలకు సరకులు రవాణా చేస్తున్న నౌకలను అడ్డుకుంటున్నారు.

హైజాక్ చేసి సోమాలియా కి తరలిస్తున్నారు. అంతేకాదు తాము హైజాక్ చేసిన నౌకల్లో డాన్సులు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. అయితే గతంలో హౌతీలు అమెరికాకు చెందిన ఒక నౌకను ఎర్ర సముద్రంలో హైజాక్ చేయగా.. ఆ సమాచారం భారత నావికా దళానికి రావడంతో ఆ కుట్రను చేధించింది.  హౌతీలు యెమన్ నుంచి మూడు సముద్రాలపై దాడులు చేస్తున్నారు.  ప్రపంచ వాణిజ్య నౌకలకు రక్షణగా తాము ఉంటామని అమెరికా ప్రకటించింది.

అగ్రరాజ్యం హౌతీ తీవ్రవాదులపై దాడులు చేస్తూ పది దేశాలతో కూడిన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. కానీ ఏ దేశమూ ముందుకు రాలేదు. యూరోపియన్ తరఫున ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటే.. భారత్ కూడా సొంతంగా సైన్యం ఏర్పాటులో నిమగ్నమైంది తప్ప ఈ టాస్క్ ఫోర్స్ లో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. అయితే బ్రిటన్ మాత్రం ఇందులో చేరి అమెరికాతో పాటు హౌతీ దాడులను ఎదుర్కొంటుంది.

ఇప్పటి వరకు తొమ్మిది నుంచి పది సార్లు హౌతీలపై దాడులను అమెరికా, బ్రిటన్ కలిపి చేశాయి. కాకపోతే ప్రధాన దాడులను అమెరికా చేస్తుంటే బ్రిటన్ వాటికి ఎస్కార్ట్ గా నడుస్తున్నాయి. కాకపోతే బ్రిటన్ మీడియా ఒక సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. యెమెన్ దగ్గరకి వెళ్లిన బ్రిటన్ యుద్ధ నౌకల దగ్గర ఆయుధాలు లేవని సంచలానాత్మక ప్రకటన విడుదల చేసింది. రెగ్యూలర్ యుద్ధ విమానాలు, మిస్సైల్స్ లాంటివి లేవని పేర్కొంది. ఓరకంగా చెప్పాలంటే గుండులేని తుపాకీతో బ్రిటన్ యుద్ధం  చేస్తోందని.. అమెరికా కు మద్దతుగా నిలిచిందని  ప్రచురించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

uk

సంబంధిత వార్తలు: