భారత్‌కు సవాల్ విసురుతున్న హైజాకర్లు?
కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో మొన్నటి వరకు ప్రశాంతత నెలకొంటే దాన్ని చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో భారత్ కు వచ్చే వాణిజ్య నౌకల్ని హైజక్ చేసి దేశాన్ని భయపెట్టే పనులు చేయడానికి సిద్దపడుతున్నారు. హిందు మహా సముద్రంలో ఇజ్రాయిల్ నుంచి భారత్ కు వస్తున్న నౌకల్ని ఇరాన్ సానుభూతి పరులైన హౌతీ తిరుగుబాటుదారులు హైజక్ చేసినట్లు తెలిసింది. అంతకుముందు ఇజ్రాయిల్ నౌకను కూడా యెమెన్ తీవ్ర వాదులు సినిమా తరహాలో హైజక్ చేసి నౌకలో ఉన్న వారిని బంధించారు. దీంతో పాటు అందులో ఉన్న అన్ని రకాల వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
అయితే దేశంలోనే కాకుండా దేశ సరిహద్దుల వెంబడి, సముద్ర తీర ప్రాంతాల్లో, దేశానికి వచ్చే వాణిజ్య నౌకలను టార్గెట్ చేసుకుని మరీ దాడులు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల అనేక రకాల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వీటికి దీటైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే మరిన్ని నౌకల్ని హైజక్ చేసే అవకాశం ఉంది.
రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నౌకల్ని హైజక్ చేసిన వారు సముద్రం లోపల దాక్కున్న వారిని వెలికితీసి పట్టుకుంటామని హెచ్చరించారు. అయితే నౌకల హైజక్ లో ఇరాన్ కు ఎలాంటి సంబంధం లేదని ఆ దేశం వాదిస్తోంది. భారత్ కు వచ్చే నౌకలపై దాడులు చేయడం వల్ల ఒక భయానక వాతావరణం సృష్టించాలని భావిస్తున్నారు. కానీ దాన్ని సమర్థంగా ఎదుర్కొంటామని భారత్ తేల్చి చెప్పింది.