వైసీపీ నుంచి వలసలు.. బాబు బిగ్ డిజప్పాయింట్?
కానీ ఇప్పుడు వరకూ ఎవరూ పెద్దగా జాయిన్ అయిన దాఖలా లేదు అని అంటున్నారు. అయితే మొన్న జగన్ ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వనని చెప్పినప్పుడు అలిగినటువంటి నలుగురు వ్యక్తులు తెలుగుదేశం పార్టీ లోకి వెళ్లడం జరిగింది. ఆనం నారాయణరెడ్డి, కోటంరెడ్డి, శ్రీదేవి అలాగే మేకపాటి ఇలా వీళ్ళు నలుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీ లోకి మళ్లడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుండి వంశీ, అలాగే విశాఖ పట్నం నుండి ఒకరు, అలాగే ప్రకాశం జిల్లా నుండి కరణం బలరాం, గిరి ఇలా ఓ నలుగురు వైసీపీ వైపు వెళ్లడం జరిగింది.
అక్కడితో వలస వెళ్లిన వాళ్ల లెక్క అనేది బ్యాలెన్స్ అయింది. జగన్ సీట్ల విషయంలో తీసుకున్న నిర్ణయంతో కొత్తవాళ్లు అవతలి పార్టీలోకి ఎగబడి వెళ్ళిపోతారని లెక్క వేశారు. అసలు కొత్తగాఎవరైనా రావడానికి తెలుగుదేశం పార్టీలో ఖాళీ ఉండాలి కదా. అసలే జనసేనతో పొత్తు ఉంది. వాళ్లకు సీట్లు ఇవ్వాలి. అంతే కాకుండా ఒకవేళ బిజెపి కనుక వీళ్ళతో వచ్చేలా ఉంటే బిజెపికి అలాగే జనసేనకి కలిపి 40 సీట్లు అయినా ఇవ్వాల్సి ఉంటుంది.
అందుకే వలసలు అనేవి ప్రస్తుతానికి ఆగిపోయాయి. అయినా కూడా ఏదో ఒకటి చేస్తాము అంటూ వైసీపీ నుండి ఇంకా జనాలను ఆహ్వానిస్తున్నాయట టిడిపి శ్రేణులు. ఒకవేళ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ద్వేషంతో తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాలనుకునే వాళ్ళు ఈ ఆహ్వానాన్ని అందుకుని ఒక ప్రయత్నం చేయవచ్చు అని అంటున్నారు రాజకీయ నిపుణులు.