మోడీ నిర్ణయంతో జగన్ లాభపడుతున్నాడా?

Chakravarthi Kalyan
మూడు రాష్ట్రాల్లో ఇటీవల విజయంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ షెడ్యూల్ కంటే కనీసం నెల ముందుగానే సాధారణ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది.  విశ్వసనీయ సమాచారం మేరకు ఏప్రిల్ లో జరగాల్సిన సాధారణ ఎన్నికలకు మార్చికి ముందస్తుకు వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి 20 నాటికి లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది.


అయితే ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉండవని.. తమకు ఆ ఆలోచన లేదని సందర్భం వచ్చినప్పుడల్లా వైసీపీ నాయకులు చెబుతూ వచ్చారు. అయితే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం ముందస్తు ఎన్నికలు వచ్చినా.. సాధారణ ఎన్నికలు జరిగినా తాము సిద్ధంగా ఉన్నామని చెబుతూ ప్రచార తంతును మొదలు పెట్టారు.  ఈ మేరకు పార్టీ శ్రేణులు అంతా ప్రజా క్షేత్రంలో ఉండేలా కార్యచరణ రూపొందించారు. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో సర్వే నివేదికలు తెప్పించుకొని బలహీనంగా ఉన్న చోట కొత్త ఇన్ ఛార్జిలను నియమించారు.


తాజాగా జరిగిన కేబినేట్ సమావేశంలో ఏపీ ఎన్నికలపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అనుకున్న దానికంటే ముందస్తుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉందని అయినా ఎన్నికలను పూర్తి సన్నద్ధంగా ఉన్నామని మంత్రులతో వ్యాఖ్యానించారు. అయినా సరే మంత్రులు క్షేత్ర స్థాయిలో మరింత సమర్థంగా పనిచేయాలి. గతంలో కంటే 20 రోజుల ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావొచ్చుఅని వ్యాఖ్యానించారు.


అయితే ఈ ఎన్నికలు జగన్ చేతిలో ఉండవని.. మోదీ ఒకవేళ ముందస్తుకు వస్తే జగన్ కూడా తప్పకుండా ముందస్తుకు రావాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలతో పాటే జరుగుతాయి కాబట్టి ఆ నిర్ణయాధికారం మోదీ చేతిలో ఉంటుంది.  వాస్తవానికి ముందస్తుకు వెళ్లడం జగన్ కు ఇష్టం లేకపోయినా..  ప్రధాని నిర్ణయాన్ని వ్యతిరేకించ లేరు కాబట్టి ముందస్తుకు వెళ్లాల్సిందే.  మరోవైపు కేంద్రంలో ఇండియా కూటమి ఇంకా బల పడలేదు. అలాగే ఏపీలో కూడా టీడీపీ, జనసేన కూటమి ఇంకా తమ ఎన్నికల కార్యచరణను పూర్తి స్థాయిలో సిద్ధం చేయలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు వెళ్తే అటు బీజేపీకి, ఇటు వైసీపీకి లాభం చేకూరే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: