అమెరికా, బ్రిటన్ అంతుచూస్తామంటున్న హమాస్?
హమాస్ మిలిటెంట్లకు కచ్చితంగా బుద్ధి చెబుతాం. ఎంతో బాధతో చెప్తున్న అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతున్నాగాజాపై దాడులు మాత్రం ఆపేది లేదు. ఏ దేశం, ఏ ఆర్గనైజేషన్ విజ్ఙప్తులను మేం పరిగణనలోకి తీసుకోం. చివరి వరకు పోరాడుతాం. కచ్చితంగా విజయం సాధిస్తాం. యుద్ధం కంటే మాకు ఏది ఎక్కువ కాదు అని నెతన్యాహూ తెలిపారు. మరోవైపు హమాస్ ను భూస్థాపితం చేయడంతో ఎన్నో దేశాలు ఊపిరి పీల్చుకుంటాయి అని తెలిపారు.
అయితే హమాస్ కీలక ప్రకటన చేసింది. అమెరికా, బ్రిటన్ లకు హెచ్చరికలు జారీ చేసింది. జియోనిస్ట్ కల్చర్ కు అలవాటు పడ్డారని విమర్శలు గుప్పించింది. ఎందుకంటే అమెరికా, బ్రిటన్ లో ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదుల ఆస్తులను టర్కీతో పాటు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే స్తంభింపజేయాలని ఆ రెండు దేశాలు చట్టాలు చేశాయి. ఈ నిర్ణయం హమాస్ తీవ్రవాదుల పాలిట శాపంగా మారింది.
దీనివల్ల హమాస్ కు ఆర్థిక మూలాలు సమకూర్చుకునేందుకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. దీంతో హమాస్ ఉగ్రవాదులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ రెండు దేశాలు జియోనిస్ట్ కల్చర్ కు అలవాటు పడుతున్నారనంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మా దేశ అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరిస్తున్నాయి. కానీ వీరు మాత్రం ప్రశాంతంగా ఉన్న ఇజ్రాయెల్ పై దాడులు చేయవచ్చు. అక్కడ శాంతి భద్రతలకు విఘూతం కలిగించవచ్చు. మరోవైపు ఇజ్రాయెల్ కు అంతర్జాతీయ మద్దతు తగ్గిపోతోంది అని ఒకవైపు హెచ్చరించిన అమెరికా తాము ఆ దేశానికి మద్దతను కొనసాగిస్తున్నట్లు పునరుద్ఘాటించింది.