ఆ హామీ అమలులో జగన్ అట్టర్‌ ఫెయిల్యూర్‌?

Chakravarthi Kalyan
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు.  ఆ తర్వాత 2014 ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని, బెల్ట్ షాపులు రద్దు చేస్తానని ప్రకటించారు. ఆ హామీ ద్వారా ఎన్నికల్లో విజయం కూడా సాధించారు. అయితే ఆయన పదవీ కాలంలో ఐదు సంవత్సరాల్లో కూడా ఈ బెల్ట్ షాపులు అనేవి కంటిన్యూ అవుతూనే వచ్చాయి.


అంతేకాకుండా ఈ బెల్ట్ షాపులకి పక్కనే ఆదనంగా పర్మిట్ రూములు కూడా కొత్తగా పుట్టుకొచ్చాయి. మద్యం విపరీతంగా వాడకంలోకి వచ్చింది అని అంటారు. దాంతో ఈ మద్య పానం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని, తాను అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం దశలవారీగా చేస్తానని జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో చెప్పుకొచ్చారు. ఏడాదికి 20 శాతం చొప్పున మద్యపానాన్ని నిషేదిస్తానని చెప్పుకొచ్చారు.


ఆయన చెప్పినట్టుగానే మొదటి ఏడాది 20% మద్యపానాన్ని నిషేధించారు. అంతేకాకుండా ఆయన రావడంతోనే బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు నిషేదించారు. అంతేకాకుండా ప్రైవేట్ మందు దుకాణాలను ప్రభుత్వీకరణ చేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ దశల వారీగా మద్యపాన నిషేధం అన్నది కాస్త మొదటి ఏడాది మాత్రమే అమలులోకి వచ్చింది. ఆ తర్వాత రెండో ఏడాది, మూడో ఏడాది కూడా కరోనా ఎఫెక్ట్ కారణం చెప్పి  కొనసాగించారు.


ఇప్పుడైతే అసలు మద్యపానం నిషేధం అన్న మాటే లేదు. ఈ విధంగా ఒకరకంగా జగన్ తాను ఇచ్చిన హామీని నెరవేర్చనట్లు అయిపోయింది. గతంలో మద్యం అమ్మకాల ద్వారా ఐదు వేల నుండి ఏడు వేల కోట్ల దాకా ఆదాయం వచ్చేది. ఇప్పుడు అది కాస్త 25 వేల నుండి 30 వేల కోట్ల వరకు పెరిగింది. అయితే గతంలో ఈ రాబడి అంతా కూడా నాయకుల జేబుల్లోకి వెళ్లిపోయేది అని అంటారు. ఇప్పుడైతే ప్రభుత్వానికి చేరుతుంది. కొంతమంది అయితే మద్యం ఆదాయం అంతా జగన్ పరమవుతుంది అని విమర్శించడం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: