ఆశ్చర్యం: అంతరిక్షంలో పిల్లలు పుట్టడం సాధ్యమేనా?

Chakravarthi Kalyan
సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా విశ్వ రహస్యాలు కొన్ని మిస్టరీగానే మిగిలిపోతున్నాయి. భూమి పట్టుక, చంద్రునిపై వాతావరణం, గ్రహాంతర వాసులు నిజంగా ఉన్నారా వంటి ఎన్నో విషయాలు ప్రశ్నగానే మిగిలిపోతున్నాయి.  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎందరో శాస్త్రవేత్తలు ఈ చిక్కుముడులను విప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందుకోసం ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. కొన్నింటికి సమాధానాలు తెలుసుకున్నా కొన్ని మిగిలే ఉన్నాయి.


అలాంటి ప్రశ్నల్లో ఒకటి అంతరిక్షంలో పునరుత్పత్తి సాధ్యం అవుతుందా ? అంతరిక్షంలో జీవించగలమా? అనే దానిపై చేసిన ప్రయోగం చివరకు విజయవంతం అయింది. అంతరిక్షంలో ఈ జీవి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 33 పిల్లలకు జన్మనిచ్చింది. అంతరిక్షంలో గర్భం దాల్చి అక్కడే జన్మనిచ్చిన ఏకైక జీవిగా రికార్డుల కెక్కింది. ఇంతకీ ఆ జీవి ఏంటని ఆలోచిస్తున్నారా.. మనం రోజు వంటగదిలో చూసే బొద్దింకే.


అంతరిక్షంలో బొద్దింక ఏకంగా 33 పిల్లలకు జన్మనివ్వడం శాస్త్రవేత్తలకు సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. రష్యా శాస్త్రవేత్తలు 2007లో దీనికి సంబంధించిన పరిశోధనలు ప్రారంభించారు.  ఫోటాన్ ఎం బయో ఉపగ్రహం సాయంతో హోప్ అనే రష్యన్ బొద్దింకను శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. ఈ బొద్దింక 12 రోజుల పాటు అంతరిక్షంలో గడిపింది. 33 పిల్లలకు జన్మనిచ్చింది. అన్ని బొద్దింక పిల్లలు పుట్టిన తర్వాత తినడం, తాగడం వంటివి చేశాయి.


సాధారణంగా బొద్దింకలు భూమిపై పుట్టిన తర్వాత వాటి వీపుపై ఓ షెల్ తయారు అవుతుంది. అది కాలక్రమేణా వయసు పెరిగే కొద్దీ బంగారు రంగులోకి మారుతుంది. అయితే అంతరిక్షంలో పుట్టిన బొద్దింకకు అలా జరగలేదు.  దాని వీపుపై ఉండే కారపేస్ పుట్టుకతోనే నల్లగా మారిపోయింది. ఆ తర్వాత ముదురు రంగులోకి మారుతూ వచ్చింది. వాటి శరీరంలో గురుత్వాకర్షణ శక్తి వల్ల మార్పులు జరగడం ప్రారంభమైంది. అంటే గురుత్వాకర్షణ వల్ల జీవుల శరీరంలో ఈ మార్పు జరిగిందన్నమాట.  అంతరిక్షంలో గురుత్వాకర్షణ ఉండదు కాబట్టి హూమిపై జరిగేవి అంతరిక్షంలో జరగవు అనే విషయాన్ని కనిపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: