వాళ్లకు నిధులు విడుదల చేసిన జగన్..?
అందులో ఎస్టీలకు టీడీపీ ప్రభుత్వం రూ. 50 వేలు ఇస్తామని చెబితే ఇప్పుడు లక్ష రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. బీసీలకు గత ప్రభుత్వం రూ. 35 వేలు ఇస్తే ప్రస్తుతం ప్రభుత్వం రూ. 50 వేలు ఇస్తుందని చెబుతున్నారు. కులాంతర వివాహం చేసుకున్న బీసీలకు గతంలో ఇచ్చిన దాని కంటే ఎక్కువగా రూ. 75 వేలు ఇస్తున్నామని ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి. కులాంతర వివాహం చేసుకున్న ఎస్టీలకు గత ప్రభుత్వం 75 వేలు ఇస్తే.. లక్ష ఇస్తున్నట్లు చెబుతున్నారు.
అయితే దూదెకుల, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ అన్ని కులాలకు సంబంధించి కులాంత వివాహం చేసుకున్న జంటలకు టీడీపీ ప్రభుత్వం కంటే ఎక్కువగా డబ్బులు అందజేస్తున్నట్లు వైసీపీ సర్కారు చెబుతుంది. కానీ కావాలనే టీడీపీ నాయకులు దీనిపై పెద్ద రాద్దాంతం చేస్తున్నారని ప్రకటిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వారు రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడుతున్నారు. అయితే టీడీపీ ఎల్లో మీడియా మాత్రం ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి చూపిస్తుందని ఆరోపిస్తున్నారు.
పథకాల కు డబ్బులు ఇచ్చే విషయంలో ఏ ప్రభుత్వానికైనా రెండు మూడు రోజులు ఆలస్యం అనేది తెలిసిన విషయమే అయినా దాన్ని కావాలనే హైలేట్ చేసి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు.. అప్పుల్లో కూరుకుపోయిందని విష ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు ఎల్లో మీడియా తీరుపై మండి పడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం పై చేసే ఆరోపణలపై ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచిస్తున్నారు.