ఏపీలోనూ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వస్తుందా?

Chakravarthi Kalyan
ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలి అన్నది బీజేపీలో చర్చగా ఉంది. ఏపీ బీజేపీ నేతలు అయితే పొత్తుల కోసం ఎదురు చూస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి జనసేన, టీడీపీతో పొత్తుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా తమ అభిప్రాయాలను అధిష్ఠానానికి తెలియజేసి హైకమాండ్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేన పార్టీలు కలసి ఎన్నికలకు వెళ్తున్నాయి. ఈ సందర్భంలో జనసేనాని పవన్ కల్యాణ్ బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని ఆకాంక్షించారు. కేంద్రంలో, రాష్ట్రంలో కూడా బీజేపీనే అధికారంలో ఉండాలని కోరారు. అయితే ఏపీలో కూడా ఇదే తరహా డిమాండ్ తో ఎన్నికలకు వెళ్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.


టీడీపీ, జనసేన కూటమిలోకి రావాలని పవన్ కల్యాణ్ ఎప్పటి నుంచో బీజేపీని కోరుతున్నారు. మరోవైపు ఏపీలో ప్రస్తుతం డబుల్ ఇంజిన్ సర్కారు నడుస్తున్నట్లే మనం భావించవచ్చు. ఎందుకంటే ఎన్డీయే కూటమిలో వైసీపీ లేకపోయినా ఆ పార్టీ బీజేపీకి అత్యంత నమ్మదగిన పార్టీ. ఎందుకంటే కేంద్రం పెట్టే ప్రతి బిల్లుకు ఏ మాత్రం ఆలోచించకుండా మద్దతు ప్రకటించేస్తూ ఉంటుంది. ఏపీ ప్రయోజనాలపై షరతులు లేకుండానే తమ అంగీకారన్ని తెలుపుతూ ఉంది.


రాష్ట్రపతి ఎన్నికలు, అవిశ్వాస తీర్మానం, పలు కీలక మైన బిల్లులు విషయంలో బీజేపీకి వైసీపీ అండగా ఉంది. మరోవైపు దీనికి టీడీపీ మినహాయింపు ఏం కాదు. టీడీపీ కూడా కేంద్ర బిల్లులకు మద్దతు తెలుపుతూ వస్తోంది. ఎక్కడా లేని విధంగా విచిత్ర రాజకీయ పరిస్థితులు ఏపీలో ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకించి ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిన అవసరం బీజేపీకి లేదు. భవిష్యత్తులో టీడీపీ జనసేన కూటమి వచ్చినా కేంద్రంలోని ఎన్డీయేకి మద్దతు తప్పకుండా ప్రకటిస్తుంది. కాబట్టి తెలంగాణలో మాదిరిగా ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిన పని లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: