ఆ దేశంలో.. భారతీయులకి ఫుల్ డిమాండ్?

Chakravarthi Kalyan
ఒక్కొక్క దేశం ఒక్కో కార్యకలాపానికి పాల్పడుతూ ఉంటుంది. దీనికి సంబంధించిన ఉదంతాల్లో కీలకమైంది ఏంటంటే.. ఇజ్రాయెల్ కు లక్ష మంది ఎందుకు అవసరం. గత నెల అక్టోబరు 7 వరకు ఇజ్రాయెల్ లో పనిచేసేందుకు గాజా వెస్ట్ బ్యాంక్ లోని పాలస్తీనా ప్రజలకు 80 వేల వరకు వర్క్ పర్మిట్లు ఇస్తూ వచ్చింది.  ప్రతి రోజూ 60 వేల మంది పాలస్తీనా ప్రజలు బోర్డర్ చుట్టూ తమ వర్క్ పర్మిట్లు చూపిస్తూ ఇజ్రాయెల్ లో పనిచేసుకొని డబ్బులు తీసుకొని సాయంత్రం ఇళ్లకు వెళ్లేవారు.


అక్టోబరు 7న ఏం జరిగింది? హమాస్ దాడి ప్రారంభం కాకముందే వ్యవసాయ నిర్మాణ రంగంలో పని చేస్తున్న వారు చెక్ పోస్టు ద్వారా కొంతమంది ప్రవేశించారని తమ పనుల్లో చెప్పారు. హమాస్ దాడి మొదలవగానే రోడ్ల పక్కన ఉన్న పాలస్తీనా ప్రజలు, వ్యవసాయ కార్మిక రంగాల్లో పనిచేసే వారు, ఇతర పనులు చేసేవారు హమాస్ తీవ్రవాదులకు ప్రత్యేక సంజ్ఞ ద్వారా ఎవరు ఎక్కడ ఉన్నది చెప్పారు. దాడికి ముందే ఒంటరి మహిళలు, వృద్ధులు ఉన్న ఇళ్ల సమాచారం హమాస్ కు ఇచ్చారు. వరుసగా ఏడు రోజులు సెలవులు కావడంతో ట్రాఫిక్ కూడా పెద్దగా లేదు. హమాస్ దాడికి సహకరించారు కాబట్టే గాజా వారికి వర్క్ పర్మిట్లు ఇవ్వడానికి ఇజ్రాయెల్ నిరాకరించింది. ఇక ముందు కూడా ఇవ్వకూడదని నిర్ణయించింది.


దీంతో అక్కడ కార్మికుల కొరత ఏర్పడింది. దీంతో లక్ష మంది భారతీయులకు స్కిల్, అన్ స్కిల్ వర్క్ పర్మిట్లు ఇవ్వడానికి ఇజ్రాయెల్ నిర్ణయించింది. దీనికి భారత్ కూడా సుముఖంగా ఉండటంతో డిసెంబరులో వర్క్ పర్మిట్లు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే సందర్భంలో తైవాన్ కూడా యువకుల కొరత ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో తైవాన్ భారత కార్మికులకు వర్క్ పర్మిట్లు ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే చైనా, రష్యా ఇలా చాలా దేశాలకు వర్క్ ఫోర్స్ అవసరం. 2035 నాటికి ప్రపంచంలో ఏ దేశానికి అయినా సరే వర్క్ ఫోర్స్ ని ఇవ్వగల దేశం భారత్ మాత్రమే. దీనివల్ల విదేశీ మారక నిల్వలు పెరిగి భారత్ అభివృద్ధి సాధించే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: