జగన్ మాట తప్పినా.. కోర్టులో రిలీఫ్?
భారీ ఎత్తున ఇస్తున్న సామాజిక పింఛన్ల దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు పిల్ పై జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ పిటిషన్ కొట్టి వేసింది. దీంతో పింఛన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వ విధానానికి మద్దతు లభించినట్లయింది. పింఛన్ల పంపిణీ అనేది ప్రభుత్వ విధాన నిర్ణయమని ఇందులో మేం జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. ఆర్థిక పరమైన అంశాలు ముడిపడి ఉన్న వ్యవహారాల్లో నిర్దిష్టంగా ఫలానా విధంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయస్థానాలు ఆదేశించలేవని పేర్కొంది.
ఏపీలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం వైఎస్సార్ పెన్షన్ కానుక పేరుతో పింఛన్లు అందిస్తోంది. అయితే ఒకే కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు ఉంటే ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి 2019లో ఒక జీవో 174 విడుదల చేసింది. కుటుంబంలో ఎంతమంది లబ్ధిదారులున్నా.. ఒకరికి మాత్రమే పింఛన్ ఇచ్చేలా నిబంధనలు మార్చింది.
దీనివల్ల ఒకే కుటుంబంలో ఇద్దరు అర్హులు నష్టపోతున్నారని.. ఎల్లో మీడియాలో వార్తలు ప్రచురించింది. అ అంశంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. దీనిపై నిర్ణయం ప్రభుత్వానికే వదిలేస్తున్నామని తెలిపింది. వాస్తవానికి జగన్ అవ్వా తాతలకు పింఛన్ అని అన్నాడు. మాట తప్పాడు మడిమ తిప్పాడు అనే కోణంలో వార్తా కథనాలు ప్రచురిస్తే బాగుండేది. ఆ విషయాన్ని ఎల్లో మీడియా విస్మరించింది.