మనతోనే కాదు.. చైనాతోనూ కెనడాకు గొడవలే?
తాజాగా చైనా చేస్తోంది కూడా అదే. చూసింది అంతా తమదే అంటుంది. ప్రపంచంపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూస్తోంది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ కుదేలై అతలాకుతలం అవుతున్న చైనా తన దుశ్చర్యలను మాత్రం వదిలిపెట్టడం లేదు. రియల్ ఎస్టేట్, సంక్షోభం తదితర కారాణాలతో చైనా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సరిహద్దు దేశాల భూమి మాదే అంటూ వాళ్ల మ్యాప్ ల్లో చూపెట్టుకుంటుంది. సముద్రం పై హక్కులు మాదే అని అదరగొడుతూ ఉంటుంది. కనిపించిందంతా మాదే అని చెబుతూ కబ్జా చేయాలని చూస్తోంది.
తాజాగా జే11 ఫైటర్ జెట్లపై చైనాకి సంబంధించిన విమానాలు దాడికి వెళ్లాయి. సౌత్ చైనా సముద్రంపై అమెరికా, యూరప్ దేశాల సలహా మేరకు ఐక్యరాజ్యసమితి తరఫున కెనడా జే11 ఫైటర్ జెట్ తో నిఘా పెట్టింది. దీనిపైకి చైనాకు సంబంధించిన యుద్ధ విమానం జే11 ఫైటర్ జెట్ పైకి దూసుకెళ్లింది. ఇదే క్రమంలో దానిపైకి మంటలను వదిలింది.
సాధారణంగా యుద్ధాల సమయంలో ప్రత్యర్థి జెట్లపై ఇలా మంటలను వదులుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం చైనా ఈ తరహా దాడులకు పాల్పడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కెనాడా కూడా దుర్మార్గపు దేశమే అయినా.. చైనాతో పోల్చితే కొంచెం తక్కువ. కెనడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. దీనిపై స్పందించిన ఆ దేశం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని చైనాను హెచ్చరించింది. కానీ అన్నిరంగాల్లో బలమైన చైనాతో కెనడా పోటీ పడగలదా.. చూద్దాం ఏం జరుగుతుందో..