ఇజ్రాయెల్‌: ఆయుధాలు పంపి రెచ్చగొడుతున్న అమెరికా?

Chakravarthi Kalyan
ఇజ్రాయెల్ ఇంకా పూర్తి స్థాయిలో పాలస్తీనా పై యుద్ధం ప్రకటించలేదు. ప్రస్తుతం చేస్తుంది యుద్ధమేగా అంటే.. హమాస్ తీవ్రవాదులపై వైమానిక దాడులు మాత్రమే కొనసాగిస్తోంది.  పాలస్తీనాలోని ఓ ప్రాంతంపై దాడి చేస్తే అక్కడ ఉన్న ఉగ్రవాదులతో పాటు అమాయకులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు.  కేవలం వైమానిక దాడులకే పరిమితమై.. భూదాడి, ఆర్మీ దాడిని ఎందుకు చేయడం లేదన్న ప్రశ్నలు పలువురి మెదళ్లను తొలిచివేస్తున్నాయి.


యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని.. ఆ దేశ సరిహద్దుల్లో తమ సైన్యం మోహరించిందని చెబుతున్నా నెతన్యాహూ మాత్రం ఇంకా యుద్ధానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. దీనిపై ఆ దేశ మంత్రి వర్గంతో పాటు సైన్యంలో కూడా కొంత నిరాశ, అసంతృప్తి చెలరేగుతుంది.  అమెరికానే బందీలను విడిపించడానికి యుద్ధం చేయకుండా ఆపుతుంది అనేది ఓ సాకు మాత్రమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీని వెనుక ఉన్న మరో కోణం ఏంటంటే..


మధ్య ప్రాశ్చ్యంలో ఉగ్రవాద మద్దతు దేశాలు ఉన్నాయి.  ఉదా ఇరాక్ లో ఉగ్రవాద సంస్థల ఆధిపత్యం ఉంది. ఇలా ప్రపంచంలో 86 దేశాల్లో ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి.  మధ్య ప్రాశ్చ్యంలో నే దాదాపు 12 దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు నడుస్తున్నాయి. వాళ్లు కూడా ఇజ్రాయెల్ పై యుద్ధానికి సిద్ధం అవుతున్నారు.  వీటిన్నింటిని సమర్థంగా తిప్పికొట్టాలంటే ఆ దేశానికి యుద్ధ సామగ్రి అవసరం.


ఇప్పటికే మిస్సైల్స్ , యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు పెద్ద ఎత్తున ఆయా ప్రాంతాలకు చేరుతున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ తీవ్రవాదులపై దాడులు తీవ్రతరం చేస్తే అప్పుడు ఆయా దేశాలు ఇజ్రాయెల్ పై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటిని అధిగమించేందుకు దారిలోనే ఆ మిస్సైల్స్ ను ధ్వంసం చేసేందుకు యాంటీ మిస్సైల్ లాంచర్లను అమెరికా సాయంతో ఇజ్రాయెల్ దించుతోంది. దీంతో పాటు మరికొన్ని యుద్ధ సామగ్రిని అక్కడ మోహరించేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే పూర్తిస్థాయిలో దాడులు చేయకుండా ఇజ్రాయెల్ ఎదురుచూస్తోంది అనేది తాజాగా వెలుగులోకి వచ్చిన అంశం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: