పవన్ ఒక్కసారిగా ఎందుకు మాట మార్చారంటే?

Chakravarthi Kalyan
పవన్ కల్యాణ్ తన మాటలను తానే వెనక్కి తీసుకుని వేరే వాళ్లు అని చెప్పినట్లుగా అనడంలో సిద్ధహస్తుడు. ముందు రోజు సభలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి టీడీపీకి మద్దతు ఇస్తాను అని మాట్లాడిన ఆయన ఎన్డీయే  నుంచి నేను బయటకు రావాలంటే వైసీపీ వారికి చెప్పి రావాల్సిన అవసరం లేదు. ప్రజలకు (మీకు) చెప్పి వస్తానంటూ వ్యాఖ్యలు చేశారు.


రెండు రోజుల వ్యవధిలో ఇలా మాటలు మార్చుతూ చెప్పింది చెప్పనట్లుగా.. అన్నది నేను మాట్లాడలేదు.. ఎవరో మాట్లాడారు అని అంటూ బుకాయిస్తున్నారు. టీడీపీ వీక్ గా ఉంది కాబట్టి నేను ఎన్డీయే లో భాగస్వామిగా ఉన్నప్పటికీ బయటకు వచ్చి మద్దతు ఇచ్చాను. మీరు బలహీనంగా ఉన్నారు కాబట్టే నేను మద్దతు ఇచ్చాను అని వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై జగన్, వైసీపీ నాయకులకు ఒకటే చెబుతున్నాను. ఈ విషయంలో మీకు అనవసరం అంటూ విమర్శలు చేశారు.


ఎన్డీయేలోకి జగన్ ను రావొద్దని చెప్పింది ఆయనే. ఎన్డీయేలో బీజేపీతో కలవాలని టీడీపీ భావిస్తున్న విషయం తెలిసిందే. గతంలో రెండు సార్లు బీజేపీతో కలిసి పోటీ చేసిన సమయంలోనే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారం చేపట్టింది. బీజేపీని కాదని రెండు సార్లు ఎన్నికలకు 2003, 2019లో వెళ్లినపుడు టీడీపీకి ఘోర పరాభవం ఎదురైంది. అసలైన లాజిక్ ఇదే.


తెలుగు దేశం పార్టీలో పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లు, ఇతర పార్టీల వారు ఎంతో మంది ఉన్నారు. కేంద్రంలో ఎవరున్నా వారు మద్దతు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవకున్నా.. కాంగ్రెస్ గెలిచినా ఇక్కడ ఉండే పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు కచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్నా పార్టీకే మద్దతు తెలుపుతుంది. కాబట్టి టీడీపీ కష్టాల్లో ఉందని నేను సాయం చేస్తాననడం కాదు.. ఎప్పటి నుంచో బీజేపీతో టీడీపీకి సంబంధం ఉన్న విషయాన్ని ఆయన తెలుసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: