జగన్.. టీడీపీని అక్కడ తొక్కిపడుతున్నాడా?

Chakravarthi Kalyan
ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా సరే తమ వాళ్లకే కాంట్రాక్ట్ పనులు, పెండింగ్ లేకుండా బిల్లులు చెల్లించాలని చూస్తుంటారు. గత ప్రభుత్వాల హయాంలో చేపట్టిన పనులకు గుత్తేదారులకు చెల్లించాల్సిన బిల్లులకు ఆటంకం కలిగిస్తూ ప్రతిపక్ష పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు.  ఎవరి అవకాశం వారు చూసుకుంటే రాజకీయ పార్టీలు తమ అనుకూల మీడియాలో మాత్రం తమ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రచారం చేస్తూ నిజాలను దాచిపెడుతుంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఒక పథకం పక్కదోవ పడితే అది కుంభకోణం. మరి వ్యవస్థలోని విధానాలను మార్చి అధికార అండతో తమ అనయాయులకు ప్రయోజనం కలిగిస్తే ఇది కుంభకోణం కిందికే వస్తుంది.  ప్రస్తుతం ఏపీ లో ఇదే జరుగుతుంది.  బిల్లుల చెల్లింపు విషయంలో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్దతికి వైసీపీ తిలోదకాలు ఇచ్చింది. తమకు అనుకూలంగా ఉన్న వారికి ముందు బిల్లులు చెల్లించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది.  దీనిపై హైకోర్టుల్లోను వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. దీనిపై కేంద్రం వివరణ కోరినా అధికార పార్టీ వెనక్కు తగ్గడం లేదు.

సంక్రాంతి లోపు రూ.15వేల కోట్లు బిల్లులు చెల్లించాలని ఆర్థిక శాఖకు వర్తమానం పంపినట్లు సమాచారం. గతంలో చంద్రబాబు హయాంలోని పోలవరం బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. కానీ పట్టిసీమ డబ్బులు చెల్లింపులు జరిగిపోయాయి. అయితే టీడీపీ హయాంలో నీరు చెట్టు తో పాటు కొన్ని పథకాలు,  బీటీ రోడ్లు వంటివి చేపట్టారు. ఇవి దాదాపు రూ.43 వేల కోట్ల రూపాయలు. వీటిని టీడీపీ నేతలకు చెల్లించకుండా వైసీపీ ప్రభుత్వం ఆపేసింది.

దీంతో కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు అభ్యర్థుల వద్ద డబ్బులేక టీడీపీ బాయ్‌కాట్‌ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం వద్ద నిజంగా డబ్బులు లేకుంటే వైసీపీ నాయకులకు కూడా చెల్లించకూడదు. కానీ తమ అనుయాయులకు వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తూ టీడీపీని ఇబ్బందులకు గురి చేస్తోందన్న వాదన వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: