
వైఎస్‌కు పేరు రాకుండా బాబు అలా చేశారా?
మనం పెట్టిన పోస్టుకు ప్రతి చర్యగా అవతలి వాళ్లు ఆధారాలతో సైతం పోస్టులు పెడుతున్నారు. ఇటీవల ఓ పార్టీ పెట్టిన పోస్టును మనం గమనిద్దాం. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అధికారంలో ఉంటే నదుల అనుసంధానం ద్వారా గోదావరి నుంచి కృష్ణా కు నీళ్లను తరలించిన విధంగా కృష్ణా నది నుంచి కుప్పంకు ఈ పాటికే తరలించేవాళ్లం. కుప్పం నుంచి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు సంయుక్తంగా డబ్బులు పెడితే నీటిని లిఫ్ట్ చేసి తమిళనాడులోని పంచెపల్లి డ్యాం కు దిగువన కావేరి నదికి నీటిని తరలించేవాళ్లం. అప్పుడు 5000 క్యూసెక్కుల ఏం కర్మ, 10 టీఎంసీల నీరు అయినా ఇవ్వగలిగేవాళ్లం. ఇది చూస్తే ఇదంతా నిజమే అనిపిస్తుంది.
వాస్తవ పరిస్థితులు గమనిస్తే కుప్పంకు కృష్ణా నది నీళ్లు ఇస్తారని చెప్పారు. టీడీపీ 21 ఏళ్లుగా అధికారంలో ఉంది. అప్పుడు ఎందుకు చేయలేకపోయింది. నదుల అనుసంధాన విషయంలో కృష్ణా నుంచి గోదావరి నీళ్లు అనే ఆలోచన చంద్రబాబుదే కానీ అది కృష్ణా డెల్టాకు స్థిరీకరించడానికి మాత్రమే ఉపయోగించారు. ఈ నీళ్లను రాయలసీమకు మళ్లించడానికి పోతిరెడ్డిపాడు వద్ద లిఫ్ట్ పెట్టించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. దీనికి వ్యతిరేకంగా అప్పట్లో చంద్రబాబు ప్రకాశం బ్యారేజీపై దీక్ష చేసిన విషయాన్ని మర్చిపోయారు. వైఎస్ ఆర్ పెట్టిన జలయజ్ణం పథకాన్ని ధనయజ్ణంగా ప్రచారం చేశారు. ముగింపు దశలోఉన్న పులిచింతల ప్రాజెక్టుకు నిధులు ఇస్తే వైఎస్ఆర్ కు పేరు వస్తోందని ఇవ్వడం మానేసిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.