ఆ జిల్లాలపై ఆశలు వదిలేసుకున్న జగన్‌?

Chakravarthi Kalyan
చంద్రబాబు నాయుడు గాని, తెలుగుదేశం పార్టీ శ్రేణులు గాని అమరావతిని రాజధానిగా కోరుకోవడంలో తప్పులేదు. కానీ అమరావతి రాజధాని అయితే ఆ ఒక్క ప్రాంతం మాత్రమే డెవలప్ అవుతుంది. కానీ జగన్ ప్రతిపాదించినట్లు మూడు రాజధానులు ఉండడం వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయంటున్నారు వైసీపీ నేతలు. ముఖ్యంగా ఆ మూడు ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందుతాయి. వ్యాపార, వాణిజ్య రంగాలు గతంలో కంటే ముందుకు సాగుతాయి.

ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈ మూడు రాజధానులు ప్రతిపాదన బాగా కలిసొచ్చే అంశం. అయితే అమరావతిని ఒక హైదరాబాదు లాంటి మహానగరంలా తీర్చిదిద్దాలంటే చాలా కాలం పడుతుందని సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే విశాఖ లాంటి నగరం  హైదరాబాదులా మారడానికి మాత్రం అట్టే టైం పట్టదు అంటున్నారు వాళ్లు. ఇప్పటికే ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు కూడా ఇక్కడ తమ కంపెనీలను పెట్టడానికి ముందుకు వస్తున్నాయి.

ఈ దసరా నుండి జగన్ తన పరిపాలన కేంద్రాన్ని  విశాఖలో మొదలు పెట్టబోతున్నారు. అయితే ఇప్పటికే హైదరాబాద్ నుండి బెజవాడ, గుంటూరు ప్రాంతాల్లోకి సచివాలయ ఉద్యోగులు, మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులు  అందరూ వచ్చి సెటిలైపోయారని తెలుస్తుంది. వాళ్ల వల్ల అక్కడ భూములు ధరలు, ఇంటి అద్దెలు ఇలాంటివన్నీ పెరిగిపోయాయని తెలుస్తుంది. ఇక ట్రాఫిక్ సమస్య ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

అయితే  ఇప్పుడు జగన్ విశాఖకు వెళ్తున్నాడని,  వాళ్లు కూడా విశాఖకు తరలి వెళ్ళిపోతే గుంటూరు, కృష్ణాజిల్లాలో అభివృద్ధి  వేగం అనేది మళ్లీ తగ్గు ముఖం పడుతుంది. దాంతో తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని ఆశించిన ఈ కృష్ణా, గుంటూరు జిల్లాల వాసులు కొంత అసంతృప్తికి లోనవుతారు. ఎంతో నమ్మకంగా ఓటు వేసి గెలిపించిన జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు ఏంటి అని పునరాలోచనలో పడతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, అందరికి సమ న్యాయం చేసే విధంగా చూడాలని ఈ మూడు ప్రాంతాలకు సంబంధించిన వారు  భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: