బాబు మనసుపై దెబ్బ.. జగన్‌ వ్యూహం అదేనా?

Chakravarthi Kalyan
వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా అణగదొక్కాలని చంద్రబాబు శత విధాలా ప్రయత్నాలు చేశారు. వైఎస్సార్ మరణాంతరం జగన్ కు కాంగ్రెస్ కు మధ్య వైరం వచ్చిన నేపథ్యంలో ఆ గొడవలో తను దూరి రాజకీయ లబ్ధి పొందాలని చూశాడనే ఆరోపణలున్నాయి. తదనంతర జరిగిన పరిణామాలల్లో జగన్ జైలుకు వెళ్లారు. దీంతో నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి వారసుల్లాగా వ్యాపారాలు చేసుకొని జగన్ రాజకీయాలు నుంచి దూరం అవుతారని చంద్రబాబు భావించి  తన అనుకూల మీడియాలో అతనిపై దుష్ర్పచారం చేశారు.


కానీ వీటిన్నంటిని తట్టుకొని జగన్ ఏపీలో ప్రతిపక్ష నేతగా అవతరించాడు. ఆ సమయంలోను పార్టీని చీల్చేలా దాదాపు 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకొని వైసీపీ ని దెబ్బకొట్టారు. 2019 లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 151 సీట్లతో అధికారాన్ని చేజక్కించుకున్నాడు.  అప్పుడు తనను ఇబ్బందులకు గురి చేసిన చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు జగన్ అవకాశం కోసం ఎదరుచూశాడు. ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు.


రేపటి 2023 ఎన్నికలకు చంద్రబాబును సిద్ధం కాకుండా చేయడం..  పోటీ అంటే టీడీపీ నాయకులు, కార్యకర్తలను భయపడేలా చేయడం,  అగ్రనాయకుల్లో వణుకు పుట్టేలా చూడటం జగన్ లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీని మానసికంగా ఇబ్బంది పెట్టి వారి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ కొట్టేలా చూడటం జగన్ వ్యూహం.  


కానీ వీటి అన్నింటిని తట్టుకొని టీడీపీ ఎకో సిస్టం బాగానే పనిచేసింది. రిమాండ్ విధించరని..  చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేస్తోంది అనే ప్రచారాన్ని విస్తృతంగా చేశారు. కానీ ఆధారాలు ఉన్నాయి అని.. కస్టడీకి వెళ్లడం అటు టీడీపీకి ఇటు చంద్రబాబుకు మానసిక స్థైర్యం కోల్పోతారు. ఫలితంగా కేడర్ అయోమయంలో పడుతుంది. ఇలా చేయడమే చంద్రబాబుపై జగన్ వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: