అసలు నిజం: గద్దర్ బిడ్డలు విదేశాల్లో ఉన్నారా?
అదే విధంగా ఆదిలాబాద్ నుంచి దండకారణ్యం వరకు అడవుల్లో గడిపారు. ప్రజల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి. కానీ తుపాకీ పట్టకుండా తూటాలు పేల్చకుండా పాటలతో ప్రజలకు సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని చెప్పిన గొప్ప వ్యక్తి ఆయన. అయితే ఆయనపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. గద్దర్ కు ముగ్గురు పిల్లలు సూర్యుడు, చంద్రుడు, వెన్నెల. అయితే రెండో అబ్బాయి చంద్ర కిరణ్ చిన్న వయసులోనే చనిపోయారు.
సూర్యుడు, కూతురు వెన్నెల ఉన్నారు. అయితే గద్దర్ తన పిల్లలను అమెరికాకు పంపించాారని, మంది పిల్లల్ని అడవుల బాట పట్టించారని ఆ మధ్య ప్రచారం జరిగింది. తన పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించి విదేశాలకు పంపించారని, గిరిజన బిడ్డల్ని అడవుల బాట పట్టించి అన్యాయం చేశారని ఆరోపణలు వచ్చాయి. మరి ఈ ఆరోపణలపై గతంలోనే గద్దర్ సమాధానమిచ్చారు. ఇప్పుడు గద్దర్ కొడుకు సూర్యడు కూడా దీనిపై స్పందించారు.
తానే ఏ దేశం వెళ్లలేదని, కనీసం ఇండియా మొత్తం కూడా చూడలేదని కానీ విదేశాలు వెళ్లాలని చేసిన ప్రయత్నాలు మాత్రం నిజమేనని చెప్పారు. కానీ చాలా మంది అవివేకంతో గద్దర్ పిల్లలు విదేశాల్లో చదువుకున్నారని, ఉద్యోగాలు చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. అది నిజం కాదని అన్నారు. హైటెక్ సిటీలో ఒక కాలేజీలో రీసెర్చ్ అసోసియేట్ గా 27 సంవత్సరాలుగా పని చేస్తున్నానని చెప్పారు. ఇలాంటి ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ఇక గద్దర్ కూతురు వెన్నెల తండ్రి స్థాపించిన స్కూలు వ్యవహారాలు చూసుకుంటున్నారు.