ఢిల్లీలో ఆ రెండు రోజులు అన్నీ బంద్?
సదస్సుకు హాజరవుతున్న భాగస్వామ్య దేశాలకు సంబంధించి నేతల భద్రత కారణంగా ఢిల్లీలోని అన్ని మాల్స్, ప్రైవేటు కార్యాలయాలు మూసి వేసి ఉంచాలని అటార్నీ జనరల్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమోదం తెలిపారు. బ్యాంకులు, దుకాణాలు, కొన్ని మెట్రో స్టేషన్లు, సుప్రీం కోర్టు సెంట్రల్ సెక్రటరియేట్ సహా, వివిధ ప్రాంతాల్లో పూర్తి భద్రత చర్యలు తీసుకోనున్నారు.
ఈ సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సహా 14 దేశాల్లోని వ్యాపార భాగస్వాముల అధిపతులు, 20 దేశాల అధినేతలు హాజరు కానున్నారు. ట్రాఫిక్ నుంచి ఇబ్బంది లేకుండా బస్సులు, ఇతర వాహనాల రాకపోకలు తగ్గించనున్నారు. అయితే ఇప్పటికే ఢిల్లీలో రోజుకు రూ.20 లక్షల వరకు చార్జీ చేస్తున్నారు. అయితే ఏదైనా ఇలా అంతర్జాతీయ సమావేశాల సమయంలో ఢిల్లీలో ఇబ్బందులు తప్పడం లేదు.
ట్రాఫిక్ సమస్యతో పాటు రద్దీగా ఉండే జనాల్ని కంట్రోల్ చేయడానికి సెలవులు ప్రకటిస్తున్నారు. కాబట్టి దేశంలో ఢిల్లీ తరహాలో రెండో రాజధాని దేశానికి అవసరం. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి విశ్వనగరానికి అన్ని అర్హతలు ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ రెండో రాజధాని చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. మరో విషయం ఎలాగో ఆంధ్ర రాజధాని అమరావతి ఉంది. దీన్ని నిర్మించడానికి చాలా ఏళ్లు పడుతుంది. కాబట్టి కేంద్రం చొరవ తీసుకుని అమరావతిని దేశానికి రెండో రాజధాని చేస్తే దీని నిర్మాణం తొందరగా పూర్తవుతుంది. అంతర్జాతీయ వేదికలకు ఇబ్బంది ఉండదని పలువురు చెబుతున్నారు.