మన చంద్రయాన్‌పై అవాకులు, చెవాకులు?
గంధపు చెక్కల స్మగ్లింగ్ చేసే పాత్రకు జాతీయ అవార్డు.. పేద గిరిజన అమ్మాయికి న్యాయం చేసే లాయర్ పాత్ర చేసిన వ్యక్తికి అవార్డు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గంగుబాయి లాంటి సినిమాకు హిరోయిన్ కు జాతీయ అవార్డు ఇచ్చారు. ఒక వేశ్య పాత్రకు జాతీయ అవార్డు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. అంతకంటే మహిళల్ని వివిధ రంగాల్లో పురోగమించేలా చేస్తున్న సినిమాలకు ఎందుకు ఇవ్వడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భావ సంఘర్షణ అనేది ఉండాలి. అయితే విబేధించాలి కానీ ద్వేషించడం మానుకోవాలి.
అయితే కొందరు చంద్రయాన్ 3 గురించి కూడా విమర్శలు చేస్తున్నారు. 14 రోజులకు రూ.650 కోట్లు పెట్టడం అవసరమా? తినడానికి తిండి దొరకని దేశంలో ఇలాంటి ప్రయోగాలు అవసరం లేదని కొందరు సోషల్ మీడియాలో పెడుతున్నారు. వాస్తవంగా చంద్రయాన్ లో చంద్రుడి మీద ప్లాస్లా పరిమాణాన్ని కొలవడాన్ని విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ చేస్తుంది. మరో వైపు చంద్రుడి ఉపరితలంపై థర్మో బౌతిక ప్రయోగం, ఉపరితలం ద్వారా వేడి ప్రవరించడాన్ని ప్రయోగాలు చేస్తుంది.
చంద్రుడి భూతలాన్ని కొలవడం, భూమి, చంద్రుడి మధ్య దూరాన్ని కచ్చితంగా కొలవడాన్ని చేస్తుంది. లేజర్ ప్రేరిత స్ప్రెక్టో మీటర్ ను ఉపయోగించి పూర్తిగా చంద్రుడి ఉపరితలంలో ఉండే ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించనుంది. ఇది భవిష్యత్తు తరాలకు అవసరం అవుతాయి. ప్రస్తుతం వెంటనే ఫలితం రాకున్నా.. దాని నుంచి నేర్చుకుని వివిధ ప్రయోగాల ద్వారా రాబోయే రోజుల్లో అంతరిక్షంలో అనేక విజయాలు సాధించి భారత కీర్తి పతాకాన్ని ఎగరేయవచ్చు.