ఆ కుంభ కోణాన్ని మోదీ వదిలిపెట్టరా?
అయితే సీబీఐ విచారణలో తేలిన విషయం ఏమిటంటే ఇందులో ఎవరూ డబ్బులు తీసుకుని వేలం వేసినట్లు లేదని తెలిసింది. ముఖ్యంగా ముందు వచ్చిన వారికి ఆ ప్రాజెక్టులో అవకాశం ఇచ్చినట్లు చెప్పింది. ఎక్కడ డబ్బులు చేతులు మారినట్లు లేదని పేర్కొంది. అయితే దీనిపై సుప్రీం కోర్టు దీనిపై సమగ్ర విచారణ చేయాలని ఆదేశించింది.
కానీ 2జీ కుంభకోణం అని దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా తమిళనాడుకు చెందిన డీఎంకే యూపీఎ లో భాగస్వామి కావడం కేంద్ర మంత్రిగా రాజా, ఎంపీ కనిమొళి పాత్ర ఉందని ఆరోపణలు రావడంతో అక్కడ రాజకీయాలు హీటెక్కాయి. తమిళనాట ఎన్నికల ప్రచారంలో అన్నా డీఎంకే అధ్యక్షురాలు జయలలిత డీఎంకే పై తీవ్ర ఆరోపణలు చేశారు. గాలిని కూడా అమ్ముకుని డబ్బులు సంపాదించారని డీఎంకేపై దుమ్మెత్తి పోశారు.
తర్వాతి కాలంలో ఈడీ దర్యాప్తులో అవినీతి జరిగిందని తేలింది. అయితే అంతకుముందే ఈ కేసును కోర్టు కొట్టేసింది. అయితే గతంలో సుప్రీం కోర్టు దర్యాప్తు చేయాలని చెబితే ఇందులో ఏ తప్పు లేదని సీబీఐ చెప్పింది. టైం లేటు అవుతుందని తెలిపింది. అయితే ఈ కేసు పునరుద్ధరణకు సీబీఐ మళ్లీ కోర్టుకు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీంతో రాజా మొదలైన వారిని విడుదల చేస్తూ ఇచ్చిన తీర్పు మీద ఢిల్లీ హైకోర్టు ఆగస్టు 28 నుంచి రోజు వారీ విచారణ జరపబోతుంది. మరి ఈ విషయాన్ని మోదీ వదలేలా లేరని తెలుస్తోంది.