జర్మనీ.. నాటోకు ఎదురు తిరుగుతుందా?
అయితే ఉక్రెయిన్, రష్యా యుద్ధం ప్రారంభం కాగానే వెంటనే అమెరికా, బ్రిటన్, ఉక్రెయిన్ కలిసి రష్యా ప్రధాన ఆదాయ వనరు నార్త్ స్ట్రీమ్ ఆయిల్ పైపులైన్ ను ధ్వంసం చేశారు. దీంతో రష్యా ఆర్థికంగా కుదేలవుతుందని భావించారు. కానీ రష్యా వీటిన్నింటిని ఢీకొని పుతిన్ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అయితే యుద్ధంలో ఉక్రెయిన్ కు మరిన్ని ఆయుధాలు అందించాలని నాటో దేశాలు అను కున్నాయి.
దీనిపై జర్మన్ లో ఒక ప్రజాభిప్రాయ సర్వే నిర్వహించారు. అందులో ఉక్రెయిన్ కు ఆయుధాలు ఇవ్వొచ్చా లేదా అనే అభిప్రాయంపై జర్మన్ ప్రజలు 52 శాతం ఆయుధాలు ఇవ్వ వద్దని సూచించారు. 36 శాతం మంది ఇవ్వొచ్చు అని చెప్పారు. మెజార్టీ ప్రజల మద్దతు వద్దు అని వచ్చింది కాబట్టి ఇప్పడు జర్మనీ ఉక్రెయిన్ కు ఆయుధాలు ఇస్తుందా లేదా అనేది సందిగ్ధంలో పడింది.
అయితే జర్మన్, స్వీడన్ కలిసి తయారు చేసుకున్న అనేక రకాల ఆయుధాలను ఉక్రెయిన్ కు ఇచ్చేందుకు స్వీడన్ ఒప్పుకుంది. కానీ జర్మనీ మాత్రం ఇంకా ఏమీ తేల్చలేదు. అయితే ప్రజల అభిప్రాయంపై సర్వే నిర్వ హించింది. ప్రైవేటు కంపెనీ మాత్రమే నని ప్రభుత్వం కాదని చెప్పింది. మరి దీంతో జర్మనీ నాటో చెప్పినట్లు విని ఆయుధాలు ఇస్తుందా? లేక ఇవ్వకుండా విడిచిపెడుతుందా ఏం చేస్తుందో చూడాలి.