ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై అమెరికా సీక్రెట్ రిపోర్ట్?
బలమైన ప్రత్యర్థితో యుద్ధం చేసేటపుడు సరైన ప్రణాళికలు, వ్యుహాలు, ఎత్తుగడలు సైనిక సామర్థ్యం, ముఖ్యంగా ఆయుధాలు అవసరం. ఇప్పటికే యూరప్ దేశాలు అమెరికా ఎన్నో ఆయుధాలు ఇచ్చింది. ఇంకా యుద్ధంలో కొనసాగాలంటే ఉక్రెయిన్ కు ఇంకా ఆయుధాల సరఫరా అవసరం. ఇదే విధంగానే మొన్నటి మొన్న అధునాతన ఆయుధాలను జర్మన్, యూరప్ దేశాలు అందించాయి. దీంతో ఉక్రెయిన్ యుద్ధంలో ముందుకు సాగింది. రష్యా లోని కొన్ని ప్రాంతాలను ధ్వంసం చేసింది.
కానీ ఇది సరిపోదు. రష్యా అంటే అణ్వస్త్ర దేశం. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రపంచ దేశాల విధ్వంసానికి పాల్పడిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే నాటో దేశాలు ఆచి తూచి సాయం చేస్తున్నాయి. అమెరికా తో ఉన్న సంబంధాల వల్ల తప్పక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేకపోతే ఎప్పుడో విడిచిపెట్టేవారు. ఎవరి దారిన వారు పోయే వారు. కానీ అమెరికా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యుద్ధంలో ప్రస్తుతం అదే పక్కకు తప్పుకోనుందా?
అసలు రహస్య నివేదిక ఏముంది. ఉక్రెయిన్ కు రష్యా పై ఇంకా పోరాడే సత్తా ఉందా? ఎలాంటి ఆయుధాలు ఎన్ని ఇవ్వాలి. రష్యా ను ఎదురించాలంటే ఇంకా ఎంత సైన్యం కావాలి. రష్యాను ఎదురించడం పొరపాటు చేయడమే అవుతుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యా, ఉక్రెయిన్ యుద్దంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనే ఉత్సుకతతో అందరూ వేచిచూస్తున్నారు.