ఖర్గే.. సోనియా చేతిలో కీలుబొమ్మ మాత్రమేనా?

Chakravarthi Kalyan
సాధారణంగా ప్రతి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో, అలాగే రిపబ్లిక్ డే వేడుకల్లో కూడా  అధికార పక్షం తో పాటు ప్రతిపక్షం కూడా హాజరు అవ్వాలి‌. అంటే దాని అర్థం ఒక దేశానికి సంబంధించిన ముఖ్య నాయకులు గతంలో  పరిపాలించినటువంటి వారు, అలాగే ప్రస్తుతం పరిపాలిస్తున్న వారు ఇరువురు హాజరవ్వాలని ఒక సంప్రదాయం. అయితే ఈ లెక్క ప్రకారం గతంలో  దేశానికి సంబంధించిన ముఖ్యమైన వేడుకల్లో అంటే ఇండిపెండెన్స్ డే వేడుకల్లో, అలాగే రిపబ్లిక్ డే వేడుకల్లో కూడా ప్రతిపక్ష నాయకురాలి హోదాలో సోనియా గాంధీ హాజరవ్వడం జరిగింది.

ఆ తరువాత అద్వానీ కూడా ఈ పెరేడ్లో పాల్గొనడం జరిగింది. మన నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి హోదాలో ఎలాగూ హాజరవ్వాలి. అయితే ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి నాయకుడైన మల్లికార్జున్ ఖర్గే  మాత్రం స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరవ్వలేదు. ఇదే ఇప్పుడు రాజకీయాలకు సంబంధించి వార్తల్లో నిలుస్తున్న విషయం. అయితే మల్లికార్జున్ ఖర్గేని ఇదే విషయంపై అడిగితే ప్రధాని నరేంద్ర మోడీకి  సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తాను వెళ్ళలేకపోయాను అని అన్నారట.

ఖర్గే ప్రతిపక్ష నాయకుని హోదాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వెళ్తే గనుక కాంగ్రెస్ కు సమస్య వస్తుందని ఇన్ డైరెక్ట్ గా వాళ్లే తప్పించారని తెలుస్తుంది. ఒకవేళ మల్లికార్జున్ ఖర్గే  కనుక కాంగ్రెస్ పార్టీ తరఫునుండి ప్రతిపక్ష నాయకుని హోదాలో వెళితే  పార్టీకి సంబంధించిన సీనియర్ నేత సోనియా గాంధీని కూడా జనాలు పట్టించుకోరని కాంగ్రెస్ అనుకుందట.

అంటే కాంగ్రెస్ పార్టీ గాంధీల కుటుంబం నుండి వచ్చిన పార్టీ కాబట్టి తాము మాత్రమే ప్రజల దృష్టిలో హైలెట్ అవ్వాలని అనుకుంటుందట కాంగ్రెస్.  గతంలో సీతారాం కేసరి ఎలా ఉండే వాడో అదే విధంగా మల్లికార్జున్ ఖర్గే కూడా రాజకీయ కుటుంబాల చేతిలో కీలు బొమ్మలా ఉండాలని ఈ విధంగా చేసుకొచ్చిందట కాంగ్రెస్. కానీ పైకి మళ్లీ ప్రజాస్వామ్య పద్ధతిని అవలంబిస్తున్నట్లు కనిపిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: