మోడీ.. నెహ్రూ, ఇందిర, పీవీ కంటే గొప్పా?

frame మోడీ.. నెహ్రూ, ఇందిర, పీవీ కంటే గొప్పా?

Chakravarthi Kalyan
దేశంలోనూ, అలాగే ప్రత్యేకించి ప్రతి రాష్ట్రంలోనూ కొలిక్కి రాని సమస్యలు ఉంటూ ఉంటాయి. వాటిని ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మార్చలేనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇక్కడ మార్చలేకపోవడం అనేది నాయకుల పని తీరులో జరిగిన వైఫల్యం అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు‌‌. అయితే చాలా మంది హామీలు ఇస్తారు కానీ ఆచరణలో చూస్తే వాళ్ళు చేసేది శూన్యం. గతంలో చూస్తే పీవీ నరసింహారావు గారి హయాంలో ఎక్కువగా కొలిక్కిరాని సమస్యలను ఆయన ఒక దారికి తీసుకు వచ్చినట్లుగా తెలుస్తుంది‌.

ఆయనతో పోలిస్తే నెహ్రూ గాని, ఇందిరా గాంధీ గాని, రాజీవ్ గాంధీ గాని ఒక 10శాతం పనులు కూడా చేయలేకపోయారని అంటారు. ఇందిరా గాంధీ అలాగే రాజీవ్ గాంధీ హయాంలో కూడా గరీబి హటావో, బేకారి హటావో అని నినాదాలు ఇస్తూ వచ్చారు‌. కానీ ఫలితాల విషయంలోకి వస్తే భారతదేశంలో వాళ్ళ పరిపాలన తర్వాత కూడా గరీబీలు అంటే పేదలు అలాగే ఉండిపోయారు. దేశంలో అసలు పేదలే లేని పరిస్థితి ఏర్పడడం అనేది ఈ గరీబీ హటావో నినాదం యొక్క ముఖ్య ఉద్దేశం.

కానీ అది జరగలేదు. కానీ నరేంద్ర మోడీని వీళ్ళ వర్గంలోకి చేర్చలేమంటున్నారు కొందరు విశ్లేషకులు. ఎందుకంటే ఆయన వచ్చాక ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారని చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా అయోధ్యలో రామ మందిరం విషయం అనేది గోడ మీద రాతలు గానే, ప్రతి నాయకుడి వాగ్దానం లాగే మిగిలిపోయింది కానీ ఆచరణలోకి రాలేదు. కానీ నరేంద్ర మోడీ దానిని ఆచరణలో పెట్టి చూపిస్తున్నారని చెబుతున్నారు.

అయోధ్యలో రామ మందిరాన్ని కట్టిస్తున్నారు. అలాగే ఆర్టికల్ 370 రద్దు కూడా చేసి సంచలనాన్ని సృష్టించారు నరేంద్ర మోడీ. ఐక్యరాజ్యసమితి తన లెక్కల్లో చెప్పిన దాని ప్రకారం 16 1/2 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారని తెలుస్తుంది. ప్రతి మనిషికి అవకాశాలు అందుబాటులోకి వస్తే మార్పు సాధ్యమవుతుందని మోడీ తాజాగా తన ఉపన్యాసంలో చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: