వచ్చే ఎన్నికల్లో జగన్ బ్రహ్మాస్త్రాలు ఇవే?
దళితులు ఇబ్బందులు పడుతున్నారని ఆ తర్వాత జీవో మార్చారు. మిగతా వారికి ఇచ్చినట్లు 1200 గజాలు కాకుండా వారికి దాదాపు 800 గజాలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. అయితే చంద్రబాబుకు సంబంధించిన ఒక వర్గం చేసిన ఈ పని వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. అయిదు పది లక్షలకు తక్కువ ధరకు కొనేసుకుని ఇలా ఎలా తీసుకుంటారని అమరావతి ప్రాంతంలో కూడా గత ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణమైంది.
సింహచలం భూములు, దళితుల భూములకు పట్టాలు ఇవ్వాలని చంద్రబాబు ఆశించారు. కానీ ఈ లోపే చంద్రబాబు ఆలోచనలను పసిగట్టిన అదే పార్టీలోని ఒక వర్గం నాయకులు దళితుల భూములకు ఏర వేసి తీసుకోవడం చేస్తున్నారు. దీంతో ఆ ప్రభావం పార్టీ పై పడుతుంది. ఇప్పుడు జగన్ ను కాదని ఇలా కాదు ఇలా చేయండి అని చెప్పడం లేదని తెలుస్తోంది. జగన్ ఏదీ చెప్తే అదే రైట్ అనే నియంతలాగా కొనసాగుతుందని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు.
చంద్రబాబు దళితులకు చేయాలనుకుని చేయని పనిని జగన్ చేసేస్తున్నారు అసైన్డ్ భూములకు పట్టాలిస్తున్నారు. దళితులకు ఎక్కడెక్కడ పట్టాలు రావాలో అక్కడ ఇచ్చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఆయన చేయాలని అనుకున్న పనులు సీఎం జగన్ చేసేస్తున్నారు. ఇక్కడ ఒకే ఒక్క కారణం కనిపిస్తుంది. జగన్ ఎవరినీ నమ్మడు. చంద్రబాబు తన వర్గాన్ని నమ్మి ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాడు.