వలస అరాచకాలు.. ఇకనైనా యూరప్‌కు బుద్ది వస్తుందా?

Chakravarthi Kalyan
అన్నదాత సుఖీభవ అంటారు పెద్దలు. అంటే మనకు అన్నం పెట్టి ఆదరించిన వాళ్ళు సుఖంగా ఉండాలి అని కోరుకోవడం, ఆశీర్వదించడం. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తిండి లేక, బ్రతకడానికి దారి లేక అనేకమంది ప్రజలు శరణార్థులుగా ఫ్రాన్స్ కి వచ్చినట్లు సమాచారం. అయితే వీళ్ళు ఫ్రాన్స్ కి అనేక దేశాల నుండి వచ్చారు. కానీ ఇలా వచ్చిన శరణార్థులకు అన్నం పెట్టి, ఉద్యోగాలు ఇచ్చి, బ్రతకడానికి ఒక దారి చూపిస్తూ ఉంటే ఎంతో కృతజ్ఞతతో ఉండాలి.


కానీ ఆ శరణార్థులు కృతజ్ఞతతో ఉండడం అలా ఉంచి తమకు ఆశ్రయం ఇచ్చిన దేశంలోనే అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వీళ్ళు ఫ్రాన్స్ కి వచ్చి మరీ అల్లర్లు సృష్టించడానికి వెనుకనున్న కారణం వాళ్ళు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశం వాళ్ళు అయితే కాదన్నట్లు సమాచారం. ఈ అల్లర్లకి వారి దేశాలైన అల్జీరియా, అల్మేనియా, ఆఫ్ఘనిస్తాన్ కూడా కారణం కాదు. అందుతున్న సమాచారం ప్రకారం వాళ్లని ఎవరూ ఇలా అల్లర్లు సృష్టించమని పురిగొల్పలేదని తెలుస్తుంది.


ఫ్రాన్స్ లో ఉన్న ఆ శరణార్థులు అక్కడ ఉన్న పోలీసులపై దాడులు చేస్తున్నారు‌. సామాన్య ప్రజలపై దాడులు చేస్తున్నారు. తాము ఏ మత దేశాల కబంధ హస్తాల చేతిలో నుండి బయటకు వచ్చారో, అదే మతాన్ని ఇక్కడున్న ప్రజలపై రుద్ది వాళ్లను కూడా తమ మతంలోకి మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఫ్రాన్స్ లో జరుగుతున్న ఈ సంఘటనల తర్వాత అయినా యూరప్ ఇలాంటి వాళ్ళ విషయంలో బుద్ధి తెచ్చుకోవాలని సూచిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.


జరుగుతున్న ఈ అల్లర్లను చూసిన తర్వాత అయినా యూరప్ కళ్ళు తెరవాలని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని అంటున్నారు వాళ్లు. ఈ సందర్భంగా యూరప్ కు సూచనలు ఇస్తున్నారు. ప్రక్క దేశాలను కూడా మత రాజ్యాలుగా మార్చేయాలని ప్రయత్నం చేసే ఈ ఉన్మాదుల విషయంలో యూరప్ ఇప్పటికైనా ఒక నిర్ణయం తీసుకోవాలని వాళ్లు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: