రెచ్చిపోతున్న రష్యా.. ప్రపంచానికి అణుభయం?

Chakravarthi Kalyan
రష్యా అధ్యక్షుడికి, బెలూరస్ దేశపు అధ్యక్షుడికి మొదటి నుండి మంచి స్నేహ సంబంధం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ స్నేహ సంబంధాన్ని ఆసరా చేసుకుని రష్యా దేశపు అధ్యక్షుడు తన అణ్వస్త్రాలను తన మిత్రుడైన బెలూరస్ అధ్యక్షుడు దగ్గర జాగ్రత్త పెట్టారని తెలుస్తుంది. దానికి కారణం  అమెరికా, యూరప్ దేశాలని తెలుస్తుంది. అమెరికా, యూరప్ దేశాలు అకస్మాత్తుగా రష్యాపై దాడి చేసి అక్కడ ఉన్న సైన్యాన్ని కూడా తమ వైపు తిప్పుకొనే ప్రమాదం ఉందని ముందే పసిగట్టాడు రష్యా అధ్యక్షుడు.


ఒకవేళ అమెరికా, యూరప్ దేశాలు గాని ఈ అణ్వస్త్రాలను  తమ చేతిలోకి తీసుకుంటాయేమో అని సందేహించాడు రష్యా అధ్యక్షుడు. అయితే బెలూరస్ కి సమీపంలో ఉన్నవే ఉక్రెయిన్, ఆ పక్కన ఉన్నటువంటి పోలాండ్. అయితే పోలాండ్ ఇప్పుడు నాటో దేశాలను ఇంకా అమెరికా యూరప్ దేశాలను ఒక విషయంలో అభ్యర్థిస్తున్నట్లుగా తెలుస్తుంది. రష్యా అణ్వస్త్రాలను  జాగ్రత్త పెట్టుకుంటుంది కాబట్టి తమకు కూడా అణ్వస్త్రాల అవసరం ఉందని పోలాండ్ దేశ అధ్యక్షుడి అభిప్రాయం అని తెలుస్తుంది.


రష్యాకు పోటీగా తాము కూడా అణ్వస్త్రాలను సిద్ధం చేసుకోవాలని భావించి పోలాండ్ ఆ విధంగా అభ్యర్థిస్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ ఆ పోలాండ్ మాటను నాటో దేశాలు అలాగే అమెరికా, యూరప్ దేశాలు ఇప్పుడు జోక్ అనుకొని వదిలేస్తున్నాయట. దానికి కారణం ఏమిటంటే  అణ్వస్త్రాలు ఉన్న దేశాలు అణ్వస్త్రాలు లేని దేశాలకు వాటిని సరఫరా చేయకూడదు.


అణ్వస్త్రాలు కలిగిన దేశాలు, ఒకవేళ మిగిలిన దేశాలు కనుక వాటిని సమకూర్చుకుంటూ ఉంటే వారికి ఆంక్షలు పెడుతూ ఉంటాయట. ఆ విధంగానే గతంలో ఇరాన్ మీద ఆంక్షలు పెట్టారు అని తెలుస్తుంది. అదే విధంగా ఇరాక్ పై కూడా ఈ అణ్వస్త్రాల కోసమే యుద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. కానీ ఇన్ని రూల్స్ ఉన్నా, ప్రక్క దేశాలపై ఇన్ని ఆంక్షలు పెడుతున్నా కూడా వీళ్లు అణ్వస్త్రాలు పోలాండుకు ఇచ్చే అవకాశమే ఎక్కువ ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: