నారాయణ.. బాబుకు నమ్మకద్రోహం చేశారా?
తెలుగుదేశం పార్టీలో అంత ప్రాముఖ్యత ఉన్న నారాయణ గత ఎన్నికల తర్వాత పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారని అంటూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నారాయణని అనేక వైపుల నుండి టార్గెట్ చేయడంతో అసలు రాజకీయాలంటేనే భయపడే స్టేజ్ కి వచ్చేసారు అని అన్నారు. ఆ తర్వాత ఆయన ఆస్తుల అటాచ్మెంట్ సందర్భంలో సిఐడి విచారణని కూడా ఎదుర్కొన్నారు. కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని నారాయణ అన్నారట.
ఇలాంటి సందర్భంలో ఏ రకంగా ఒప్పించారో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు నారాయణ కి నెల్లూరు సీట్ ని ఖరారు చేశారు. అయితే నెల్లూరులో ఆయనకు ప్రత్యర్థి అనిల్ కుమార్ యాదవ్. 2014లో నారాయణకు వ్యతిరేకంగా నిలబడి ఆయనపై గెలిచినటువంటి వ్యక్తి. ఆ ఎన్నికల్లో నారాయణ కోట్లు ఖర్చు పెట్టినా కూడా అనిల్ కుమార్ యాదవే గెలిచాడు. అయితే ఇప్పుడు తాజాగా అనిల్ కుమార్ యాదవ్ నారాయణ పై ఒక కీలకమైన ఆరోపణ చేశారు.
మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో నెల్లూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఓడించమని నారాయణ తనకు డబ్బులు పంపించారని ఆయన అన్నారట. అయితే ఆ డబ్బులను తాను తిరిగి వెనక్కి పంపించేసానని ఆయన చెప్పడం జరిగింది. నారాయణ విద్యాసంస్థల అధినేతగా నారాయణ రాజకీయ పార్టీలకు పార్టీ ఫండింగ్ అనేది ఇస్తూ ఉంటారు. అయితే అనిల్ కుమార్ యాదవ్ కి ఇచ్చిన డబ్బు పార్టీ ఫండింగ్ రూపంలో ఇచ్చిన డబ్బా లేదంటే మరొకటా అనేది తేలాల్సి ఉంది. ఆ ఫండింగ్ నే టిడిపిని ఓడించడానికి ఇచ్చారన్నట్లుగా చెప్తున్నారా అనేది తేలాలి.