పీఓకేను ఇండియా స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా?
అయితే అక్కడి సైన్యంలోని ఒక వర్గానికి ఇమ్రాన్ ఖాన్ రావాలని బలంగా ఉందని తెలుస్తుంది. ఇమ్రాన్ ఖాన్ వస్తే ఇప్పుడు ఉన్న సైనిక చీఫ్ ని మార్చేస్తాడని తెలుస్తుంది. అప్పుడు వాళ్లు సైన్యం మీద పట్టు కోల్పోతారట. దాంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్షన్లు జరిగితే తాము ఓడిపోతాం కాబట్టి ఎలక్షన్స్ జరగకూడదని అనుకుంటున్నారట అక్కడి ప్రభుత్వం ఇంకా సైన్యం. అలాగని ఎలక్షన్లు ఆపడానికి వీలు లేదు అందుకని అక్కడ మార్షల్ లా తీసుకురావడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది.
దాని ప్రకారం ఏదైనా దేశంతో యుద్ధం జరిగితే గనుక ఎలక్షన్లు ఆపవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశంతో యుద్ధానికి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి పిఓజెకేని అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ అంశాన్ని మధ్యలోకి లాగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికోసం పాకిస్తాన్ ఇప్పుడు చైనా సహాయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఒక పక్కన సిపెక్ చైనా పాక్ కారిడార్ కి నిధులు ఇవ్వడానికి అనుమతించడం లేదట.
దాంతో ఇప్పుడు పాకిస్తాన్ చైనాను బ్రతిమలాడుకొని పాకిస్తాన్‌లో నుండి ఎప్పుడో విడిపోయిన పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్ము కాశ్మీర్ లో సొరంగాలు, బంకర్లు ఇంకా సైనిక స్థావరాలను ఏర్పాటు చేసే బాధ్యత చైనాకి అప్పగిస్తుంది పాకిస్తాన్. అయితే చైనాను పక్కన పెట్టేసిన అమెరికా ఇప్పుడు భారత్ కు సపోర్ట్ చేస్తుంది. అదే టైంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా పిఓజెకేను ప్రెస్టీజియస్ గా తీసుకోవడంతో భారత్ పాకిస్తాన్ పై దాడికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది అంటున్నారు. మొన్న ప్రధాని ఈజిప్ట్ పర్యటన కూడా దీనికి బలాన్ని ఇస్తుంది.