ఉక్రెయిన్‌పైకి కొత్త ఆయుధాలు ప్రయోగిస్తున్న రష్యా?
కానీ వీళ్లు ఆ లాంచర్లతో పెద్ద పెద్ద యుద్ధ విమానాలను సైతం కూల్చేసే వాళ్లు. అలా అప్పట్లో రష్యా గట్టిగానే ఎదురు దెబ్బలు తిన్నదని తెలుస్తుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదట్లో ఉక్రెయిన్ కూడా ఇదే విధమైన యుద్ధ నైపుణ్యాన్ని వాడినట్లుగా తెలుస్తుంది. అంటే ఉక్రెయిన్ ఈ హ్యాండ్ మేడ్ మిస్సైల్ లాంచర్లను వాడినట్లుగా తెలుస్తుంది. ఉక్రెయిన్ కు రెండు రకాల సైన్యం ఉందని తెలుస్తుంది. అందులో ఒక రకం రెండేళ్లు సైన్యంలో పనిచేసి ఆ తర్వాత ఎవరి పనులు వాళ్ళు చూసుకుని తిరిగి సైన్యంలో చేరిన రకం ఒకటి.
అయితే కొన్నాళ్లు మధ్యలో గ్యాప్ రావడం వల్ల వాళ్లకు యుద్ధ నైపుణ్యంలో సరైన అనుభవం రాదు, ఉండదు. అలా కాకుండా సుదీర్ఘకాలం నుండి యుద్ధ కార్యక్రమాల్లో ఉంటూ ముందుకు వెళ్లే వాళ్లకి యుద్ధ నైపుణ్యం ఉంటుంది, అనుభవం ఉంటుంది. వాళ్లనే ఫ్రంట్ లైన్ సోల్జర్స్ అంటారు. అయితే ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ కి సంబంధించిన ఈ ఫ్రంట్ లైన్ సోల్జర్స్ ను లేపేస్తుందని తెలుస్తుంది. చెప్పాలంటే ఒకరకంగా ఇది ఉక్రెయిన్ కు తీవ్రమైన నష్టమే.
రష్యా తన యుద్ధ విమానాల ద్వారా, యుద్ధ మిస్సైల్స్ ద్వారా ఇప్పుడు ఉక్రెయిన్ లోపల ప్రాంతాలపై కూడా దాడి చేస్తుంటే చోద్యం చూస్తూ కూర్చోవడం ఉక్రెయిన్ వంతు అయినట్లుగా తెలుస్తుంది. భూమి మీద తిరుగుతున్న ఉక్రెయిన్ సైన్యాన్ని ఆకాశం నుండి లేపేస్తుందట ఇప్పుడు రష్యా.