
చంద్రబాబు.. ఆ మాటలు మానుకుంటే బెటర్?
అయితే ఇక్కడ వారు తెలుసుకోవాల్సిన విషయం మరోటి ఉంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నపుడు ప్రజలను కోటీశ్వరులను, లక్షాధికారులను ఎందుకు చేయలేకపోయారనే ప్రశ్న ఉద్భవిస్తుంది. ఇప్పుడు అధికారంలోకి వస్తే ఎలా లక్షాధికారుల్ని చేయగలరనే వివిధ ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. పేదలకు ఉపాధి మార్గాలను చూపి వారు స్వావలంభనతో జీవించేట్టు చేస్తే చాలు వారు ఎప్పుడు లక్షాధికారులు కావాలని అనుకోరు.
ఎన్నడూ కోటీశ్వరులు కావాలని ఆశించరు. కష్టపడి ఉన్నదాంట్లో సంతోషంగా గడపాలని కోరుకుంటారు. అలాగైతే ఒకే సారి లక్ష రూపాయలు ఇచ్చి మీరు లక్షాధికారులు అయిపోయారు అని చెబుతారా? తెలుగుదేశం పార్టీ నాయకుల మాటలు వింటుంటే ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటి నుంచో దారిద్య్రం ఎక్కువగా ఉన్నట్లు అందరూ పేద వారిగా మిగిలిపోయినట్లే తెలుస్తోంది.
వీరిని ఉన్నపళంగా లక్షాధికారి చేయాలంటే ఎంత గొప్ప పథకాలు తీసుకురావాల్సి ఉంటుంది. వారిని ఎన్ని రకాలుగా మార్చాల్సి ఉంటుంది. అధికారంలోకి రావడానికి టీడీపీ నాయకులు ఇస్తున్న హామీలను చూసి చాలా మంది నవ్వుకుంటున్నారు. పేద వారిని లక్షాధికారి చేస్తామని చెప్పే మాటలు కాస్త హస్యాస్పదంగా కనిపిస్తున్నాయి. అలా అయితే జగన్ ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా కొన్ని కుటుంబాలకు నాలుగేళ్లలో రెండు మూడు లక్షల వరకు ఆదాయం వచ్చి ఉంటుంది.
అంత మాత్రాన వారు లక్షాధికారులు అయిపోయినట్లేనా.. కాదు కదా.. ప్రజలకు కావాల్సింది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తమ కాళ్లపై తాము నిలబడేలా ఉపాధి మార్గాలను చూపిస్తూ వారి ఆదాయ మార్గాలను పెంచితే చాలు వారే లక్షాధికారులు కావాలో కోటీశ్వరులు కావాలో కష్టపడి సాధించుకుంటారు.