టీడీపీ ఓవరాక్షన్‌.. ఎన్టీఆర్‌ రంగంలోకి దిగాల్సిందేనా?

Chakravarthi Kalyan
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజకీయాలలో లేరు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో  కూడా ఎక్కడ పాల్గొనడం లేదు. దీని గురించి  ఎన్టీఆర్ పై ఆమె తల్లిపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నోరు తెరవాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు కొడుకు హరికృష్ణ రెండో భార్య కుమారుడే జూనియర్ ఎన్టీఆర్ అని అందరికీ తెలిసిన విషయమే.

మొదట్లో వీరు కలిసి ఉండేవారు కాదు. హరికృష్ణ మొదటి కొడుకు యాక్సిడెంట్ లో చనిపోయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం వారితో కలిసి పోయింది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువగా కలిసే ఉంటున్నారు.  రెండు కుటుంబాలు కూడా కలిసి పోయాయి. గతంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడినా కూడా ప్రస్తుతం ఆ కుటుంబం కలిసే ఉంటుంది.

జూనియర్  ఎన్టీఆర్ కు రాజకీయాలంటే విరక్త లేక సినిమాలంటే ఇష్టమా, వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని అనుకుంటున్నారా ఆయనపై కుటుంబం పై తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిసిన ఆయన పట్టించుకోవడం లేదు. అయినా ఆయనపై చాలా మంది వ్యక్తిగత విమర్శలు  చేస్తున్నారు. దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలంటే జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాలని  అభిమానులు కోరుకుంటున్నారు.
 
తెలుగు దేశం పార్టీలో కలవక పోవడమే నష్టమా.. లేక చంద్రబాబు పట్ల ద్వేషామా, లేక అవమానాలు చేశారనే కోపం ఉందా, లేదా రాజకీయాలు చేయడం అంటే ఆయనకు ఇష్టం లేదా ఎదో విషయం బహిరంగంగా ప్రకటిస్తే అయిపోతుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ అలా చెప్పకపోవడం పై ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆవేదన చెందేలా బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కి నటనలో వారసుడిగా  కొనసాగుతున్నారు. కానీ పార్టీ కి కూడా కావాల్సిన అవసరం ఉందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ పై చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు ఎలా కట్టడి చేస్తారో.. ఏం బదులిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: