అగ్ర రాజ్యాలకు మోడీ ఘాటు వార్నింగ్‌?

Chakravarthi Kalyan
ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్యసమితిని నిలదీయడంతో ఇప్పుడు ప్రధానంగా చర్చలోకి వచ్చారని తెలుస్తుంది. శాంతిని నెలకొల్పడానికి ఉన్న ఐక్యరాజ్యసమితి అశాంతి పెరిగిపోతుంటే ఏం చేస్తుందని అడిగారు ప్రధాని నరేంద్ర మోడీ. గత శతాబ్దపు పద్ధతిలోనే ఉంటూ ఉంటే ఎలా నడుస్తుందని ఆయన అడిగారు. కాలమాన పరిస్థితులను బట్టి ఐక్యరాజ్యసమితి లాంటి ఒక ప్రపంచవ్యాప్త సంస్థ మారకపోతే ఎలా అని ఆయన నిలదీశారు.

ప్రపంచంలో ఒక పక్కన అశాంతి పెరిగిపోతూ ఉంటే  పట్టించుకోవాల్సిన ఐక్యరాజ్యసమితి పట్టించుకోకపోవడం ఏంటని ఆయన అడిగారు. ఒక పక్కన రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. అంతకుముందు ఇజ్రాయిల్ పాలిస్తేనా మధ్య కూడా గొడవ నెలకొంది. సౌదీ అరేబియా కి ఇరాన్ కు మధ్య గొడవలు జరిగాయి. సిరియాకు సౌదీ అరేబియా కు కూడా మధ్య కూడా గొడవలు జరిగాయి. ఈ సందర్భాలు అన్నిట్లోనూ ఐక్యరాజ్యసమితి ఏం చేస్తుంది, ఏం చేసింది.

ప్రేక్షక పాత్ర వహించింది. ఇంకా మహా చెప్పాలంటే కొన్ని ఉపన్యాసాలు మాత్రమే ఇస్తూ వచ్చింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ జి 7 సదస్సుకు వచ్చిన  దేశాల ముందు ఐక్యరాజ్యసమితిని నిలదీశారు. సంస్కరించుకోకపోతే ఐక్యరాజ్యసమితి వల్ల ప్రపంచానికి వచ్చే ప్రయోజనం ఏముంటుంది అని ఆయన అడిగారు. అసలు ఐక్యరాజ్యసమితి ఉండి ఉపయోగం ఏముంది ఇలా ఉంటే అని ఆయన ప్రశ్నించారు.

ఇన్నాళ్ళ నుండి మీరు ఐక్యరాజ్యసమితిని విస్తరించుకోకపోవడం ఏమిటి అని ఆయన అడిగారు. ఎప్పుడో శతాబ్ద కాలం ముందు స్వాతంత్రం రాకముందు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదలైన ఐక్యరాజ్యసమితి సభ్యత్వ దేశాల విషయంలో సంఖ్య పెంచుకోకపోవడం ఏంటని ఆయన అడిగారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆ ఐదు దేశాలే దాంట్లో ఉంటున్నాయని ఆయన అన్నారు. ఉగ్రవాదం గురించి  మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పట్టించుకోదు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రవాదాన్ని కూడా పట్టించుకోదు, ఖండించదు.  అసలు ఏ ప్రాతిపదికన ఐక్యరాజ్యసమితి ఏర్పడిందో, జరుగుతుందో, ఆలోచించమని  హితవు పలికారు మన నరేంద్ర మోడీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: