చెవిలో చిన్నమాట: అయితే.. బాబు బలంగా ఉన్నాడన్నమాట.. ఏం `పలికారండీ`..
``అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబు బలంగానే ఉన్నాడన్నమాట``- ఇదీ ఇప్పుడు బీజేపీలో నేతల మ ధ్య చెవిలో చిన్నగా సాగుతున్న గుసగుస! ఓ మీడియా అధినేత వారం వారం రాసే ఓ `పలుకు`లో ప్రస్తు తానికి చంద్రబాబును బలహీనపర్చడానికే బీజేపీ–వైసీపీ ఉమ్మడిగా కృషి చేస్తున్నట్టు రాజకీయ పరిశీలకు ల భావన. చంద్రబాబు బలహీనపడని పక్షంలో ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత చెడటం ఖాయం. అని రాసుకొ చ్చారు. దీంతో ఇది రాజకీయ గుసగుసకు దారితీసింది. దీని అర్ధం ఏంటి? అంటే.. చంద్రబాబు ఇప్పుడు బాగా బలంగా ఉన్నాడని, ఈయనను బలహీన పరిచేందుకు బీజేపీ, వైసీపీలు ప్రయత్నిస్తున్నా యని సదరు పలుకుల ఉద్దేశం.
మరి టీడీపీ పరిస్థితి ఇలానే ఉందా? ఇప్పుడు చాలా బలంగానే ఉందా? -ఇదే విషయంపై బీజేపీ నేతల మధ్య చర్చ జరుగుతోంది. ``అరరే.. టీడీపీ పని అయిపోయిందని అనుకున్నామే. నలుగురు రాజ్యసభ సభ్యులను మన పార్టీలోకి లాగేసుకున్నాం. ముగ్గురు ఎమ్మెల్యేలను వ్యూహాత్మకంగా వైసీపీ నేత జగన్ టీడీపీ నుంచి లాగి పడేశాడు. అయినా కూడా టీడీపీ బలంగానే ఉందన్నమాట!? అబ్బో.. మా మంచి పలుకులు పలికారే!`` అంటూ.. చెవిలో చిన్నగా చెప్పుకొంటున్నారట కమల పార్టీ నాయకులు. అంతటితో ఆగకుండా టీడీపీ పరిస్థితిని కూడా విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నాయకత్వం టీడీపీ అధినేతపైనే చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కూడా వీరి చర్చల్లో వచ్చింది.
``ఇక, జిల్లాల వారీగా చూసుకున్నా.. పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది కదా? కొన్ని కొన్ని జిల్లాల్లో జెండా మో సే నాధుడు కూడా టీడీపీ అధినేతకు కనిపించడం లేదు కదా? యువ నాయకులు పదవుల కోసం వెంప ర్లాడుతున్నారు కదా..? మరికొందరు గత పాపాలను కడుక్కునేందుకు వైసీపీలోకి వెళ్లిపోయారు కదా? అయినా కూడా ఈ మీడియా అధిపతి పలికిన పలుకులను బట్టి టీడీపీ ఇంకా బలంగానే ఉందంటావా?`` అని సందేహం వెలిబుచ్చే కమలం పార్టీ నాయకులు కూడా కనిపిస్తున్నారు. నిజానికి టీడీపీ గత ఎన్నిక లకు ముందు వరకు బలంగా ఉందని అనుకున్నారు. ఈ విషయం ఒకింత కరెక్టే! కానీ, అధికారం కోల్పోయిన తర్వాత.. బాబు పరిస్థితి దారుణంగా తయారైందనేది వాస్తవం.
నాయకులకు క్రమశిక్షణ చెప్పడంలో మాకు మించిన పార్టీ మరొకటి లేదని చెప్పుకొన్న చంద్రబాబు.. ఇప్పుడు అసలు కట్టు కూడా లేని పరిస్థితికి పార్టీ దిగజారి పోయింది. కీలక నాయకులు ఎవరూ కూడా పార్టీకి అందుబాటులో ఉండడం లేదు. అదేసమయంలో ప్రభుత్వం పై చేస్తున్న విమర్శలకు కూడా పెద్దగా గుర్తింపు రావడం లేదు. ప్రజల్లోకి కూడా పార్టీ కార్యక్రమాలు వెళ్లలేక పోతున్నాయి. ఇక, పార్టీ తరఫున పిలుపునిస్తే.. నిరసనలు కానీ, ఆందోళనలు కానీ.. సక్సెస్ రేటును అందుకోలేక పోతున్నాయి. ఇక, ఇప్పటి వరకు ఉన్న అంచనాలను బట్టి మరికొందరు పార్టీ నుంచి జంప్ అవుతారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
మరి ఇన్ని జరుగుతున్నా కూడా .. పార్టీ బలంగానే ఉందని.. బీజేపీ-వైసీపీలు కూడబలుక్కుని బలహీనపరుస్తున్నాయని వ్యాఖ్యానించడం.. ఆ మీడియా అధినేత టడీపీ అధికారంలో ఉండగా.. ``తిన్న పాపానికి`` సమర్ధించడమే తప్ప మరో రీజన్ లేదు. టీడీపీని బలహీన పరిచేందుకు ఎవరో కంకణం కట్టుకొవాల్సిన అవసరం లేదు.. ఆ పార్టీ చేసుకున్న పాపాలే ఆ పార్టీని బలహీనపరుస్తాయనడంలో సందేహం లేదు అంటున్నారు బీజేపీ నేతలు.. చెవిలో చిన్నగా!!