తెలంగాణలో ఎస్సై - లేడీ కానిస్టేబుల్ - ఆపరేటర్ ముగ్గురి మృతి కేసులో డబుల్ ట్విస్ట్..?
- ( ఉత్తర తెలంగాణ - ఇండియా హెరాల్డ్ ) . .
తెలంగాణలో కొద్ది రోజుల క్రితం చర్ల ఎస్సై ఆత్మహత్య చేసుకున్న సంఘటన యావత్ పోలీస్ సమాజాన్ని నివ్వెర పరిచింది. ఎస్సైను ఓ మహిళ ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆయన తీవ్ర ఒత్తిడికి గురయ్యి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నిజామాబాద్ జిల్లా బిబిపేట ఎస్ఐ సాయికుమార్ - కానిస్టేబుల్ శ్రుతి - కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఒకేసారి మృతి చెందటం తెలంగాణ పోలీస్ వర్గాలలో తీవ్ర కలకలం రేపుతోంది. మీరందరూ కామారెడ్డి జిల్లాలో సదాశివ నగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో మృతదేహాలుగా లభ్యం అయ్యారు. కామారెడ్డి జిల్లా బిబిపేట ఎస్సైగా సాయికుమార్ పని చేస్తున్నారు. అదే పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తోంది శృతి .అక్కడ నిఖిల్ కంప్యూటర్ ఆపరేటర్.
ఎస్సై సాయికుమార్కు పెళ్లయింది .. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. శృతికి పెళ్లయిన భర్తకు విడాకులు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ మధ్య బంధం ఏర్పడినట్టు ప్రచారం ఉంది. వీళ్ళని దగ్గర చేసేందుకు కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ తనవంతు ప్రయత్నాలు చేసినట్టు అనుమానాలు ఉన్నాయి. భిక్కనూరులో డ్యూటీ చేస్తున్న సాయికుమార్‌కు బీబీపేటకు బదిలీ అయింది. ఇదే టైంలో నిఖిల్ కు శృతికి సాన్నిహిత్యం ఏర్పడినట్టు చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన సాయికుమార్ గట్టిగా ప్రశ్నించడంతో ముగ్గురు మధ్య వివాదం ముదిరినట్టు చెబుతున్నారు. ఇదే విషయంపై మాట్లాడేందుకు ముగ్గురు చెరువుగట్టు దగ్గర కలిసినట్టు పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ముగ్గురూ కలిసిన తర్వాత ఏమైంది ? అంతా ముకుమ్మడిగా చెరువులోకి దూకి ఎందుకు ? ఆత్మహత్య చేసుకున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది. అసలు ఇవి ఆత్మహత్యలా .. హత్యలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాల పోస్టుమార్టం పూర్తయి మృతుల సెల్ఫోన్ డేటా రికవరీ పూర్తి అయ్యాక ఈ కేసును పోలీసులు ఛేదించే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.