పోకిరి లెవెల్ ట్విస్ట్.. తండ్రిని చంపిన హంతకుడిని పట్టుకునేందుకు?

praveen
పిల్లల కళ్ల ముందే తల్లిదండ్రులను అత్యంత పాశవికంగా చంపేస్తే పిల్లలు ఎంతలా తల్లడిల్లిపోతారో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో కొందరు అనాధలుగా మారి జీవితం దుర్భరంగా గడుపుతూ ఉంటారు. మరికొందరు నేరస్తులుగా తయారవుతూ ఉంటారు. అయితే ఆ చిన్నారి అలా కాలేదు. అలా అయితే ఇపుడు మనం ఇక్కడ తన గురించి మాట్లాడుకునేవాళ్ళం కాదేమో! అవును, అచ్చం సినిమా స్టోరీని తలపించే ఓ రియల్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రేక్షలను అబ్బుర పరుస్తోంది.
ఏ నేరం చేయని తన తండ్రిని హత్య చేసిన ఓ హంతకుడిని బాధితుడి కూతురు, సరిగా 25 సంవత్సరాలు తరువాత పట్టుకొని పగతీర్చుకుంది. అందుకోసం ఆమె జీవితాన్నే పణంగా పెట్టింది మరి! వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్ లో రొరైమాలోని గిస్టెనే సిల్వా డి డ్యూస్ అనే 35 ఏళ్ల మహిళ తన తండ్రిని చంపిన వాడిని ఎలాగన్నా శిక్షించాలని ఏకంగా పోలీస్ గా అవతరించింది. కట్ చేస్తే... నేరస్తుడికి శిక్ష పడ్డాక ఆమె సంబరాలు చేసుకుంది.
అసలేం జరిగిందంటే.. 'గిస్టెనే సిల్వా‌డి డ్యూస్' అనే మహిళా పోలీస్ తండ్రికి సంబందించిన కధ ఇది. 1999లో మార్కెట్ లో కూరగాయలు సప్లై చేసే డ్రైవర్ రైముండో, అల్వెస్‌ గోమ్స్‌ వద్ద 20 పౌండ్లు బాకీ పడ్డాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ వాగ్వాదం జరిగేదట. ఈ క్రమంలో ఓ రోజు వారి గొడవ చెలరేగి పెద్ద గొడవగా మారింది. అప్పటికీ తన వద్ద ఉన్న ఫ్రీజ్‌ని తీసుకోమని జోస్ చెప్పినా అతగాడు వినలేదు. ఆ సందర్భంలో క్షణికావేశంలో అల్వెస్‌ గోమ్స్‌ తన వద్ద ఉన్న గన్ తో జోస్ ని కాల్చి చంపాడు. 2013 లో ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి గోమ్స్ ని పట్టుకొని 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. కానీ ఆ తీర్పు అప్పీల్ చేస్తూ గోమ్స్ జైలు శిక్ష నుంచి తప్పించుకున్నాడు. ఆ తరువాత గోమ్స్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
అయితే ఈ తంతు జరిగిన సమయంలో జోస్ విసెంట్ కూతురు సిల్వా‌డి డ్యూస్ వయసు 9 ఏళ్లు. అప్పుడే తన తండ్రిని చంపిన వాడిపై రివేంజ్ తీర్చుకోవాలని ఆమె బలంగా మనసులో నిశ్చయించుకుంది. దానికోసం డ్యూస్ 19 ఏళ్ళ వయసు వయసులోనే లాయర్ పట్టా పుచ్చుకుంది. తర్వాత పోలీస్ డిపార్ట్ మెంట్లో చేరి, వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తూ.. తన తండ్రిని హత్య చేసిన నిందితుడు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ చేస్తూ... గత నెల 25 న అతన్ని పూర్తి ఆధారాలతో అరెస్ట్ చేసింది. దాంతో 60 ఏళ్ల వయసులో గోమ్స్ జైలుకి వెళ్ళాడు. ఈ సందర్భంగా డ్యూస్ మాట్లాడుతూ.. "నా కళ్ల ముందు నాన్నను చంపిన వ్యక్తిని చూడగానే నాకు చంపేయాలనేంత కోపం వచ్చింది. కానీ కోర్టు వాడికి తగిన శిక్ష వేసింది. ఇప్పుడు నా కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది!" అంటూ ఎమోషనల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: