విమానం గాల్లో ఉండగా ఇంజన్ ఫెయిల్.. చివరికి ఏం జరిగిందంటే?
ఇక ఇలాంటి తరహా ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే ఇక ఇటీవల మరోసారి ఇలాంటి ఘటన జరిగింది. ఏకంగా విమానం గాల్లో ఉండగానే ఇంజన్ ఫెయిల్ అయింది. దీంతో ఇక అందులో ఉన్న ప్రయాణికులు అందరూ కూడా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని ఫిక్స్ అయిపోయారు. కానీ ఊహించని రీతిలో అందరికీ భూమ్మీద నూకలు బాకీ ఉండడంతో పైలెట్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఇక విమానాన్ని అత్యవసరంగా లాండింగ్ చేశారు. ఈ క్రమంలోనే విమానంలోని సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. ఇండిగో విమానంలో ఇలాంటి ప్రమాదం జరిగింది. కోల్కతా నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసరంగా లాండింగ్ చేశారు.
6ఈ 0573 విమానం గాల్లో ఉండగానే ఒక ఇంజన్ ఫెయిల్ అయింది. ఇక ఈ విషయాన్ని వెంటనే పైలెట్ గుర్తించాడు. దీంతో వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి డిక్లరేషన్ ఇచ్చారు. ఇక రెండు రన్వేలను పైలెట్ కి అందుబాటులో ఉంచారు. ఇక ఆ విమానంలో ఉన్న ప్రయాణికులు అందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కానీ ఒక్క ఇంజన్ తోనే పైలెట్ ఎంతో చాకచక్యంగా విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేశారు. అయితే ఒక ఇంజన్లో మంటలు కనిపించాయని.. ప్రయాణికులు కూడా చెప్పుకొచ్చారు ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఏకంగా సిబ్బందితో సహా మొత్తం విమానంలో 173 మంది ఉన్నారని వారంతా సురక్షితంగా ఉన్నారని.. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు అని ఇండిగో విమానయాన సంస్థ తెలిపింది.