షాకింగ్ : మ్యాగీ తిని.. మర్డర్ చేసేసాడు?

praveen
నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే మనుషుల్లో ఉన్న విచక్షణా జ్ఞానం పూర్తిగా తగ్గిపోతుందేమో అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు పరిస్థితులను బట్టి సందర్భాన్ని బట్టి మనిషి ప్రవర్తన తీరు మారిపోతూ ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ఏకంగా సాదాసీదాగా ప్రవర్తించాల్సిన ఘటనల్లో కూడా మనిషి రాక్షసుడిగా మారిపోయి దారుణాలకు పాల్పడుతున్నారు. సొంత వారి విషయంలో కూడా కాస్తయినా జాలి దయ చూపించడం లేదు. దీంతో విచక్షణ జ్ఞానం పూర్తిగా మనుషుల్లో లోపిస్తుంది అన్నది ఇలాంటి ఘటనలను చూస్తూ ఉంటే అర్థమవుతుంది.

 ఒకప్పుడు మానవత్వం జాలీ దయ అనే గుణానికి కేరాఫ్ అడ్రస్ ఆగా ఉండే మనిషి.. ఇక ఇప్పుడు మాత్రం ఏకంగా క్రూరత్వానికి చిరునామాగా మారిపోతున్నాడు. ఎంతలా అంటే అడవుల్లో ఉండే క్రూర మృగాలు కూడా మనుషులకంటే బెటర్ ఏమో అన్న విధంగా ఇక ఎంతో మంది ప్రవర్తన తీరు మారిపోయింది. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న కారణాలతోనే దారుణంగా ప్రాణాలు తీసేస్తున్నారు  చాక్లెట్ తిన్నంత ఈజీగా ఇతరుల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఎంతో మందిని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన అయితే మరింత దారుణమైనది. ఏకంగా మ్యాగీ తిని మర్డర్ చేసేసాడు ఇక్కడ ఒక వ్యక్తి.

 ఈ ఘటన గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. యూపీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటావా రైల్వే స్టేషన్ సమీపంలో ఒక దుకాణంలో బావ, బావమరిది కలిసి మ్యాగీ తిన్నారు. ఇక ఏదో విషయంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. మాట మాట పెరిగి గొడవ జరిగింది. దీంతో బావమరిది తన బ్యాగులో ఉన్న కత్తి తీసి బావ కడుపులో పలుమార్లు పొడిచాడు. ఇక ఆ తర్వాత గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఇక డెడ్ బాడీని తీసుకువచ్చి రోడ్డుపై పడేసాడు. అయితే ఈ ఘటనతో చుట్టుపక్కల ఉన్న స్థానికులందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ హత్య చేసిన తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు సదరు వ్యక్తి. అయితే ఈ హత్య జరిగిన సమయంలో అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కేవలం ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు. ఎవరు ఆపే ప్రయత్నం చేయలేదు. కాగా హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: